న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మారడోనా.. మీకోసమే ఫుట్‌బాల్ చూశాం.. సాకర్ లెజెండ్‌కు నివాళులర్పించిన యావత్ భారత్!

Diego Maradona dies of heart-attack: From PM to Sourav Ganguly India fraternity mourns his demise

హైదరాబాద్: ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా మృతిపై యావత్ భారత్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అసలు ఫుట్‌బాల్ మారడోనా కోసమే చూశామని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా అర్జెంటీనా సాకర్ దిగ్గజానికి నివాళులర్పించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు మారడోనా మృతిపై ట్విటర్ వేదికగా స్పందించాడు. ఫుట్‌బాల్‌ మాంత్రికుడు డీగోకు భారత క్రికెట్ జట్టులోనూ విశేషమైన అభిమానులున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ నుంచి ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి దాకా ఈ దిగ్గజానికి ట్విటర్‌ వేదికగా నివాళులర్పించారు.

టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, సురేశ్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, అనిల్‌కుంబ్లేతో పాటు రవి చంద్రన్‌ అశ్విన్‌ లాంటి స్పిన్నర్లు డీగో మృతికి సంతాపం తెలిపారు. మారడోనాకు సంబంధించిన తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

డీగో ఆత్మకు శాంతి చేకూరాలి..

డీగో ఆత్మకు శాంతి చేకూరాలి..

‘డీగో మారడోనా ఫుట్‌బాల్‌ దిగ్గజం. తన కెరీర్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ ఆటలో అతడు మర్చిపోలేని అనుభూతులు మిగిల్చాడు. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లడం అందర్నీ బాధకు గురిచేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.'అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘డీగో లాంటి దిగ్గజం మనల్ని విడిచి వెళ్లారు. ఫుట్‌బాల్‌ ఆటను అందమైన క్రీడగా మార్చిన మాంత్రికుడు. అతని సన్నిహితులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నా.'అని రాహుల్‌ గాంధీ నివాళులర్పించాడు.

క్రీడా ప్రపంచానికి పెద్ద లోటు..

క్రీడా ప్రపంచానికి పెద్ద లోటు..

‘క్రీడా ప్రపంచానికి ఇదో పెద్దలోటు. తన ఆటతో ఎన్నో మధురజ్ఞాపకాలు మిగిల్చిన మన చిన్ననాటి స్టార్‌ లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. డీగో మారడోనా మీరెప్పటికీ మా మదిలో ఉంటారు.'అని సురేశ్ రైనా ట్వీట్ చేయగా.. ‘ డీగో క్రీడాలోకంలోనే అతిగొప్ప ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడి మరణవార్త కలచివేసింది. తన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.'అని వీరేంద్రసెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ‘ఫుట్‌బాల్‌ దిగ్గజాల్లో ఒకరైన డీగో మారడోనా మనల్ని విడిచి వెళ్లిపోయారు. క్రీడా ప్రపంచానికి ఇదో బాధాకరమైన సందర్భం. అతని ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి.'అని సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ నివాళులర్పించాడు.

మీతోనే ఫుట్‌బాల్..

మీతోనే ఫుట్‌బాల్..

‘క్రీడా ప్రపంచానికి, ఫుట్‌బాల్‌ క్రీడకు డీగో మరణం తీరని లోటు. నేను ఫుట్‌బాల్‌ ఇష్టపడేందుకు కారణం మీరే. మీ ఆత్మకు శాంతి కలగాలి ఛాంపియన్‌ డీగో'అని అనిల్‌కుంబ్లే ట్వీట్ చేశాడు. ‘ ఈ క్రీడా ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ కోల్పోతుంది. మీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా డీగో'అని ట్విటర్ వేదికగా రవిచంద్రన్‌ అశ్విన్‌ రాసుకొచ్చాడు. ‘దిగ్గజ ఆటగాడు మారడోనా మృతిచెందారని తెలిసి చాలా బాధగా ఉంది. అతని జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. తన ఆటతో మైదానంలో మధుర జ్ఞాపకాలు మిగిల్చాడు. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ డీగో. మిమ్మల్ని కోల్పోతున్నాం.' యువరాజ్‌ సింగ్‌ ట్వీట్ చేశాడు.

‘మీరు ఆడే రోజుల్లో ఎన్నోసార్లు మాకు పట్టరాని సంతోషాల్ని ఇచ్చారు. వాటన్నిటికీ ధన్యవాదాలు. ఈ ఆటలో అత్యున్నత శిఖరాలకు చేరిన ఏకైక వ్యక్తి డీగో మారడోనా. మీ ఆత్మకు శాంతి చేకూరాలి'రవిశాస్త్రి నివాళులర్పించారు.

Story first published: Thursday, November 26, 2020, 13:48 [IST]
Other articles published on Nov 26, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X