కరోనా దెబ్బకు రోజు కూలీగా మారిన ఫుట్‌బాల్ ప్లేయర్!కైరో: కరోనా తెచ్చిన కష్టం అంత ఇంత కాదు. ఇప్పటికే ఈ మహమ్మారి ధాటికి యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. సగటు మానవుడి జీవితం అస్థవ్యస్థమైంది. వలస కూలీల బతుకులే ఆగమయ్యాయి. ఇక క్రీడా రంగం మొత్తం కుదేలైంది. స్టార్ క్రికెటర్ల విలాసాలకు ఇబ్బందులు లేకున్నా.. కిందిస్థాయి ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కరోనా తెచ్చిన కష్టంతో ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ ఏకంగా రోజు కూలీగా మారాడు. ఈ మహమ్మారి దెబ్బకు టోర్నీలన్నీ రద్దవ్వడంతో ఆదాయం లేక.. కుటుంబానికి బుక్కెడు బువ్వ పెట్టడానికి దినసరి కూలీగా అవతారమెత్తాడు. స్ట్రీట్ వెండర్‌గా స్వీట్లు అమ్ముతున్నాడు.
టోర్నీలు రద్దవ్వడంతో..

టోర్నీలు రద్దవ్వడంతో..

అతనేవరో కాదు ఈజిప్టు ఫుట్‌బాల్‌ ఆటగాడు మాహరుస్‌ మహమౌద్‌. ఆ దేశ ఫుట్‌బాల్‌ జట్టు బెనీ సూయెఫ్‌ డిఫెండర్‌.. కరోనా మహమ్మారి లేకుంటే ఈ పాటికి అతడు సాకర్‌ పోటీల్లో మునిగి తేలుతుండేవాడు. కానీ కొవిడ్‌-19 దెబ్బకు దేశమంతా లాక్‌డౌన్‌లో ఉండడంతో ఫుట్‌బాల్‌ లీగ్‌లు మూతపడ్డాయి. దాంతో సంపాదనకోసం 28 ఏళ్ల మహమౌద్‌ రోజుకూలీగా మారాల్సి వచ్చింది.

 క్లబ్‌కు ఆడితే రూ.15 వేలు..

క్లబ్‌కు ఆడితే రూ.15 వేలు..

ఈజిప్టు రాజధాని కైరోకు 350 కిలో మీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న మన్‌ఫలుట్‌ అనే చిన్న పట్టణం మాహరుస్‌ మహమౌద్‌ స్వస్థలం. 16 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారిన మహమౌద్‌ కెరీర్‌కోసం స్వస్థలం నుంచి బెనీ సూయెఫ్‌ పట్టణానికి మారాడు. మంచి డిఫెండర్‌ అయిన మహమూద్‌ను క్లబ్‌ సహచరులు మాంచెస్టర్‌ సిటీ కెప్టెన్‌ విన్సెంట్‌ కొంపనీ.. పేరిట ‘కొంపనీ' అని ముద్దుగా పిలుస్తుంటారు. క్లబ్‌కు ఆడటంద్వారా మహమౌద్‌ నెలకు 200 అమెరికన్ డాలర్లు( రూ. 15 వేలు )సంపాదిస్తుండేవాడు. తనతో పాటు తల్లి, తండ్రి, సోదరుడు జీవించేందుకు ఆ మొత్తం సరిపోకపోవడంతో అతడు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కూడా చేస్తుండేవాడు.

 బేకరిలో పని చేస్తూ..

బేకరిలో పని చేస్తూ..

మార్చిలో ఈజిప్టులో లాక్‌డౌన్‌ కారణంగా తానాడుతున్న క్లబ్‌ మూతపడడంతో మహమౌద్‌ రోడ్డునపడ్డాడు. పాక్షిక లాక్‌డౌన్‌ సమయంలో స్వస్థలానికి చేరిన అతడు.. కుటుంబాన్ని ఆదుకొనేందుకు ఏదో ఒకపని చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో నిర్మాణ సంస్థలో కూలీగా చేరి రోజుకు 7 అమెరికన్ డాలర్లు (రూ. 500) సంపాదించాడు. అయితే పూర్తి లాక్‌డౌన్‌తో ఆ పని కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం రంజాన్‌ మాసం కావడంతో మన్‌ఫలుట్‌లో లాక్‌డౌన్‌లోనూ దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. దాంతో ఓ బేకరీలో అతడు మరోసారి రోజుకూలీగా చేరాడు. అక్కడ పరాటాలు, దోశలు వేస్తూ, సేమ్యాతో పిండివంటలు చేస్తున్నాడు. వాటిని నెత్తిన పెట్టుకొని వీధిల వెంబడి తిరుగుతూ అమ్ముతున్నాడు.

మరి..కరోనాతో భయంలేదా అని అడిగితే.. ‘భయం ఉంది. కానీ కుటుంబాన్ని పోషించుకోక తప్పదు కదా' అని మహమౌద్‌ చెప్పుకొచ్చాడు.

 వచ్చెనెలలో పెళ్లి..

వచ్చెనెలలో పెళ్లి..

కుటుంబ పోషణ కోసం ఏ పనిచేయడానికైనా సిద్దమని తెలిపిన మహరుస్.. వచ్చె నెల తన పెళ్లి ఉందని, దాని కోసం కూడా ఇంకొంచెం ఎక్కువ కష్టపడుతున్నట్లు తెలిపాడు. చిన్న గదిలోనే కుటుంబంతో నివసరించే మహరుస్.. తొలుత బాక్సర్‌గా తన స్పోర్ట్స్ కెరీర్‌ను ప్రారంభించాడు. అతనంత హ్యాండ్ బాల్‌కు మారాడు. ఇక అతని నైపుణ్యాన్ని పసిగట్టిన కోచ్‌లు సాకర్ టీమ్‌లో చేరేలా ఒప్పించారు. దీంతో 16 ఏళ్లకే ఫ్రొఫెషన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అదేందో నేను డబుల్ సెంచరీలు చేసిన రెండు సార్లు కోహ్లీ రనౌట్ అయ్యాడు: రోహిత్

https://telugu.mykhel.com/cricket/two-run-outs-for-virat-kohli-two-double-tons-for-rohit-sharma-028196.html

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 21, 2020, 8:55 [IST]
Other articles published on May 21, 2020
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X