న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

చిన్నారి బెన్‌కు సర్‌ప్రైజ్: ఇంగ్లాండ్ వరల్డ్‌‌కప్‌ను డెలివరీ చేస్తుందా? అంటూ ప్రశ్న

By Nageshwara Rao
Ben was unable to walk and talk before his treatment but a week ago he asked for the World Cup

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు సాకర్ అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లను అందరూ వీక్షిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ అనే చిన్నారికి కూడా పుట్‌బాల్ అంటే పిచ్చి.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

బెన్‌కు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే బర్మింగ్ హామ్‌లోని క్వీస్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చేర్పించారు అతడి తల్లిదండ్రులు. దీంతో అతడికి మొదటి ఆరు వారాల రేడియోథెరపీని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. రేడియోథెరపీ కోసం ఆసుపత్రిలో చేరే సమయంలో బెన్ నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు.

కానీ, క్వీస్ ఎలిజబెత్ ఆసుపత్రి వైద్యులు అతడి పట్ల చూపించిన ప్రేమాభిమానులు అతడిని చాలా తొందరగానే కొలుకునేలా చేశాయి. రేడియోథెరపీ మొదటి ఆరువారాల చికిత్స పూర్తి అయిన తర్వాత అతడు కోలుకున్నాడు. దీంతో చిన్నారి బెన్‌ను అక్కడి ఆసుపత్రి సిబ్బంది సర్‌ప్రైజ్‌కు గురి చేశారు.

స్వతహాగా పుట్‌బాల్ అంటే అభిమానించే బెన్‌కు రేడియోథెరపీ తర్వాత కోలుకున్న అనంతరం ఫిఫా వరల్డ్ కప్ నమూనాని బహుకరించారు. దీంతో బెన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు రేడియోథెరపీ చికిత్స అనంతరం బెన్ అందుకున్న మొట్టమొదటి కానుక వరల్డ్ కప్ నమూనా కావడంతో ఎంతో సంతోషానికి లోనయ్యాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. "బ్రెయిన్ ట్యూమర్‌ నుంచి కోలుకుని బెన్‌ అడిగిన వరల్డ్‌కప్‌ నమూనాను మేం డెలివరీ చేశాం. అలాగే ఇంగ్లాండ్ ప్రజలు ఎంతో బలంగా కోరుకుంటున్న ఫిఫా వరల్డ్‌కప్‌‌ను ఇంగ్లాండ్ జట్టు డెలివరీ చేస్తుందా?" అంటూ ఆ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.

కాగా, టోర్నీలో భాగంగా జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ జట్టు స్వీడన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం రాత్రి 7.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) సమరలోని సమర ఎరీనాలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

Story first published: Friday, July 6, 2018, 13:02 [IST]
Other articles published on Jul 6, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X