Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ కెరీర్ దూసుకుపోతే.. నాది పాతాళానికి పడిపోయింది: ఆర్పీ సింగ్

RP Singh Says MS Dhonis career graph went up, mine down but our friendship remained intact

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ దూసుకుయిన సందర్భంలో తనది మాత్రం దిగజారిందని భారత మాజీ పేసర్ ఆర్పీసింగ్ తెలిపాడు. కానీ ధోనీ ఎంత ఎదిగినా తమ స్నేహం మాత్రం చెక్కు చెదరలేదని ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ పేసర్ చెప్పుకొచ్చాడు. భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఆర్పీ సింగ్.. ఫామ్‌లో ఉన్నప్పుడే తనను పక్కకు పెట్టారని, కారణం చెప్పకుండానే జట్టుకు దూరం చేశారని ఆరోపించాడు.

జట్టులో ఉంటాడనుకుంటే..

జట్టులో ఉంటాడనుకుంటే..

భారత్ తరఫున 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేంట్ర చేసిన ఆర్పీ సింగ్.. ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన తొలి టీ20 ప్రపంచప్‌ జట్టులో ప్రధాన పేసర్. ఈ మెగాటోర్నీలో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ పేసర్.. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఆర్పీసింగ్‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని అంతా భావించారు. మీడియం పేస్‌తో పాటు బంతిని ఇరువైపులా స్వింగ్ చేయ‌గ‌ల ఆర్పీ.. దీర్ఘ‌కాలం పాటు దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తాడ‌నుకుంటే.. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం అతని టీ20 కెరీర్ మూడు టీ20లకే పరిమితమైంది. ఇక భారత్ తరఫున ఈ లెఫ్టార్మ్ పేసర్ చివరిసారిగా 2011 సెప్టెంబర్‌లో ఆడాడు.

ఇప్పటికీ మా స్నేహం అలానే..

ఇప్పటికీ మా స్నేహం అలానే..

జాతీయ జ‌ట్టులోకి రాక‌ముందే మ‌హేంద్ర సింగ్ ధోనీ, ఆర్పీసింగ్‌ మంచి స్నేహితులు. దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించినా.. 2011 ప్రపంచకప్ , 2013 చాంపియన్స్ ట్రోఫీ విజయాలతో ధోనీ కెరీర్ అమాంతం దూసుకుపోగా. . ఆర్పీసింగ్ మాత్రం పాతాళానికి పడిపోయాడు. తాజాగా ఇదే విషయంపై ఆర్పీసింగ్ మాట్లాడుతూ.. ‘మేం ఇద్దరం కలిసి చాలా సమయాన్ని గడిపేవాళ్లం, కబుర్లు చెప్పుకునేవాళ్లం, ధోనీ కెప్టెన్ అయిన తర్వాత అతని కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్లింది. అదే సమయంలో నా కెరీర్ మాత్రం పడిపోయింది. కానీ మా మధ్య ఉన్న స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అప్పటిలానే మాట్లాడుకుంటాం.. కబుర్లు చెప్పుకుంటాం. కానీ క్రికెట్ విషయానికొస్తే మాత్రం మా మధ్య బేధాబ్రిపాయాలు ఉంటాయి'అని ఆర్పీ సింగ్ తెలిపాడు.

రవిశాస్త్రి వల్లే నా కెరీర్ మారిపోయింది : సచిన్

కష్టపడూ అదృష్టం కలిసొస్తే..

కష్టపడూ అదృష్టం కలిసొస్తే..

ఇక టీమిండియా తరఫున ఎక్కువ రోజులు ఆడాలంటే ఏం చేయాలని ధోనీని కూడా అడిగానని కానీ, అతను ఇప్పటి వరకు సరైన సమధానం చెప్పలేదన్నాడు. ‘నువ్వు కష్టపడుతుండూ.. ఆపై అదృష్టం కలిసొస్తే చోటు లభిస్తుందని ధోనీ తెలిపాడు.'అని ఆర్పీసింగ్ గుర్తు చేసుకున్నాడు. ఇక సెలెక్టర్లు కూడా ఫామ్‌లో ఉన్న తనను ఎందుకు పక్కన పెట్టారో ఇప్పటి వరకు కారణం చెప్పలేదన్నాడు.

ఐపీఎల్‌లో మెరిసినా..

ఐపీఎల్‌లో మెరిసినా..

‘మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలోనే జ‌ట్టుకు దూర‌మ‌య్యా. వ‌న్డేలు, టెస్టుల‌కు అస‌లు నా పేరును ప‌రిగ‌ణించ‌లేదు. ఆ స‌మ‌యంలోనే ఐపీఎల్లో వ‌రుస‌గా రెండు మూడు సీజ‌న్లు టాప్ వికెట్ టేక‌ర్‌గా నిలిచినా అవకాశం దక్కలేదు. బహుషా నాపై నాటి కెప్టెన్‌కు నమ్మకమైనా లేకుండాలి. లేదా నా పెర్ఫామెన్స్ అయినా అధ్వాన్నంగా ఉండాలి. ఈ అంశంపై సెలెక్ష‌న్ క‌మిటీ సంప్ర‌దిస్తే.. నువ్వు క‌ష్ట‌ప‌డుతూ ఉండు.. త‌ప్ప‌క అవ‌కాశం వ‌స్తుంది అని చెప్పారే త‌ప్ప చాన్స్ మాత్రం ఇవ్వ‌లేదు.' అని ఆర్పీ సింగ్ అన్నాడు.

ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆర్పీ సింగ్.. భారత్ తరఫున 14 టెస్టులు, 58 వన్డేలు ఆడాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 40 వికెట్లు పడగొట్టిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. వన్డేల్లో 69 వికెట్లు తీశాడు. ఇక 2009 ఐపీఎల్ సీజన్‌లో 23 వికెట్లతో టాప్‌బౌలర్‌గా నిలిచి డెక్కన్ చార్జెస్ ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్రపోషించాడు. మొత్తానికి ధోనీ తన స్నేహితుడే అంటూ.. అతని వల్లే తన కెరీర్ ముగిసిందని ఆర్పీ సింగ్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Monday, April 27, 2020, 12:02 [IST]
Other articles published on Apr 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+