Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: వామ్మో ఆ క్యాచ్ పట్టుంటే.. వణుకుపుడుతుందిరా సీనా! (వీడియో)

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుసగా రెండో టైటిల్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. గురువారం వాంఖడే వేదికగా ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా గట్టెక్కింది. సంజూ శాంసన్ విధ్వంసం.. జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్.. అక్షర్ పటేల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ టీమిండియాను విజేతగా నిలబెట్టాయి.

అయితే ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క తప్పిదంతో ఇంగ్లండ్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. అది కూడా మ్యాచ్ ఆరంభంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలకమైన క్యాచ్ వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ తప్పిదం తన కెరీర్‌లోనే ఓ మాయని మచ్చగా నిలిచిపోనుంది. సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విరోచిత బ్యాటింగ్ ప్రదర్శన చేసిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్‌పై కూడా అదే జోరు కనబర్చాడు.

The Drop That Cost a World Cup What If Harry Brook Had Caught Sanju Samson
Photo Credit: screen grab for JioHotstar

దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కలిసి వచ్చింది. 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంజూ శాంసన్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో ఓవర్‌లో శాంసన్ ఇచ్చిన క్యాచ్‌ను మిడాన్‌లో హ్యారీ బ్రూక్ అందుకోలేకపోయాడు. ఈ క్యాచ్ వదిలేయడమే కాదు టైటిల్‌ను కూడా వదిలేసాననే విషయం అర్థం అవ్వడానికి బ్రూక్‌కు ఎక్కువ సమయం పట్టలేదు.

Take a Poll

ఈ క్యాచ్ డ్రాప్ ఇంగ్లండ్ బౌలింగ్ లయను కూడా దెబ్బతీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలో ఉన్నా ఆ తర్వాత భారత్ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఎందుకంటే ఆ ఓవర్‌కు ముందే విల్ జాక్స్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ ఔటయ్యాడు. సంజూ శాంసన్ కూడా వెనుదిరిగి ఉంటే భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొనేది.

అప్పుడు భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడేవారు. ఒకవేళ ఏ బ్యాటర్ అయినా సెట్ అయినా భారత్ 253 పరుగుల భారీ స్కోర్ అయితే చేసేది కాదు. ఈ అవకాశంతో సంజూ శాంసన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ క్యాచ్ వదిలేసిన తర్వాత 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు.

ఈ మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ కూడా తన తప్పును అంగీకరించాడు. 'క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి'..అని తాను మాత్రం సంజూ క్యాచ్ వదిలేసి ఇంగ్లండ్ ఓటమికి కారణమయ్యానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ ఒక్క క్యాచ్ డ్రాప్ భారత్‌ను గట్టెక్కిస్తే.. ఇంగ్లండ్‌ను ఇంటికి చేరేలా చేసింది. అందుకే భారత అభిమానులు ఈ క్యాచ్‌ను గుర్తు చేసుకొని వణికిపోతున్నారు. 'వామ్మో ఆ క్యాచ్ పట్టుంటే.. తలచుకుంటేనే వణుకుపుడుతుందిరా సీనా'అనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Story first published: Friday, March 6, 2026, 13:19 [IST]
Other articles published on Mar 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+