న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీక కోస్తానని హెచ్చరించడంతోనే 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టా: యువరాజ్

Yuvraj Singh reveals what provoked him to hit six sixes against Stuart Broad


న్యూఢిల్లీ:
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సృష్టించిన పరుగుల విధ్వంసం గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను నెలకొల్పిన 6 బంతుల్లోని 6 సిక్సర్ల ప్రపంచరికార్డు భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్డ్ బ్రాడ్‌ను బలి పశువును చేస్తూ యూవీ బాదిన ఆ బాదుడు..అతనికి సిక్సర్ల సింగ్ అనే బిరుదునిచ్చింది. యూవీ అనే పేరు వింటేనే ఆ విధ్వంసం కళ్ల ముందు కదలాడేలా చేసింది.
Yuvraj Singh Reveals The Argument He Had With Flintoff Before Hitting Six Sixes | Oneindia Telugu

గొడవే కారణమని తెలుసు..కానీ

ఆ మ్యాచ్‌లో నాటి ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతోనే యూవీ ఈ అరుదైన ఫీట్ సాధించాడని ఆ మ్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరికి అర్థమవుతుంది. కానీ యూవీని ఫ్లింటాఫ్ ఏమన్నాడు? అనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా ఈ ఘటనకు సంబంధించిన విషయాలను ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలేదు.

 ఫ్లింటాఫ్ స్లెడ్జింగ్..

ఫ్లింటాఫ్ స్లెడ్జింగ్..

ఆ మ్యాచ్‌లో 17వ ఓవర్ వేసిన ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. అసహనానికి గురైన ఫ్లింటాఫ్ ఆ ఓవర్‌ ఆఖరి బంతికి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు వెళ్తున్న యువీ నోరుపారేసుకున్నాడు. దీనికి యూవీ కూడా అదే రితీలో స్పందించడంతో మాటామాటా పెరిగి ఆఖరికి ఫీల్డ్ అంపైర్ కలగజేసుకుని సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మరుసటి ఓవర్ స్టువర్ట్ బ్రాడ్ వేయగా ఫ్లింటాఫ్‌పై ఉన్న కోపాన్ని యువరాజ్ బంతిపై చూపించాడు.

 హిట్టింగ్‌తోనే బదులివ్వాలని..

హిట్టింగ్‌తోనే బదులివ్వాలని..

అయితే ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తాజాగా యువరాజ్ చెప్పాడు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సిక్సర్ల సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆజతక్ చానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా నాటి మ్యాచ్ క్షణాలను గుర్తు చేసుకొని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఫ్లింటాఫ్ మాటలు తనకి కోపం తెప్పించాయని వెల్లడించిన యూవీ.. హిట్టింగ్‌తోనే అతనికి బదులివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే నా మైండ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాలనే ఆలోచన లేదు. కానీ.. ఫ్లింటాఫ్‌తో గొడవ నన్ను హిట్టింగ్‌కు పురిగొల్పింది. అంతక ముందు ఓవర్‌లో ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాను. దాంతో అసహనానికి గురైన అతను మరో ఎండ్‌కు నడుచుకుంటు వెళ్తున్న నాపై నోరుపారేసుకున్నాడు. అప్పుడు అతను ఏం అన్నాడో అనేది మాత్రం సరిగ్గా చెప్పలను. కానీ నేను రెండు పేలవ షాట్లు ఆడాను అని మాత్రం చెప్పాడు. నేను కూడా ఏ అంటున్నావని బదులివ్వడంతో మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ అతనే: గంభీర్

నా బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసు కదా..

నా బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసు కదా..

ఈ క్రమంలో ఫ్లింటాఫ్.. ‘నీ గొంతు కొస్తా'అని హెచ్చరించాడు. దీంతో నేను కూడా ‘నా చేతిలోని బ్యాట్‌‌ను చూస్తున్నావు కదా.. దీంతో నిన్ను ఎక్కడ కొడతానో నీకు బాగా తెలుసు'అని బదులిచ్చా. ఆ తర్వాత ఓవర్‌లో ప్రతీ బంతినీ స్టేడియంలోకి కొట్టాలని నిర్ణయించుకున్నా. అదృష్టవ శాత్తు ఆ రోజు నాకు కలిసొచ్చింది'అని యువరాజ్ పేర్కొన్నాడు.ఇక ఇదే ఇంటర్వ్యూలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సురేశ్ రైనా అంటే ఇష్టమని యూవీ చెప్పుకొచ్చాడు. 2011 ప్రపంచకప్‌లో అతన్ని తుది జట్టులోకి తీసుకు రావడానికి తెగ ఇబ్బంది పడ్డాడని గుర్తు చేసుకున్నాడు.

Story first published: Monday, April 20, 2020, 13:13 [IST]
Other articles published on Apr 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X