Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ అతనే: గంభీర్

Gautam Gambhir Says Rohit Sharma is the best skipper in the IPL

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తన దృష్టిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహితే ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు. క్రికెట్ నుంచి త‌ప్పుకునేలోపు అత‌డు మ‌రో మూడు ట్రోఫీలైనా సులువుగా త‌న ఖాతాలో వేసుకుంటాడ‌ని ఈ మాజీ ఓపెనర్ జోస్యం చెప్పాడు.

మరో మూడు టైటిళ్లు పక్కా..

మరో మూడు టైటిళ్లు పక్కా..

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. ‘జట్టును ఎన్నిసార్లు విజేతగా నిలిపామన్నదానిపైనే కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. ఇది రోహిత్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. ముంబై ఇండియ‌న్స్ సార‌థిగా అతను నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీ సాధించాడు. కెరీర్ ముగిసేలోగా మ‌రో మూడు టైటిల్స్ గెలుస్తాడు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ సారధిగా అతను చరిత్రలో నిలుస్తాడు. కనీసం 6-7 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచే సత్తా రోహిత్‌కు ఉంది'అని హిట్‌మ్యాన్ కెప్టెన్సీని గంభీర్ కొనియాడాడు.

విజయాల్లో రోహిత్ థర్డ్..

విజయాల్లో రోహిత్ థర్డ్..

2013 సీజన్‌లో రికీ పాంటింగ్ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. అదే సీజన్‌ ముంబై జట్టును విజేతగా నిలిపి తొలి టైటిల్ అందించాడు. ఆ తర్వాత కూడా 2015,2017,2019 సీజన్లలో కూడా చాంపియన్‌గా నిలిపాడు. ఇక ఐపీఎల్‌లో 104 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్.. 60 విజయాలందించాడు. అత్యధిక విజయాలందించిన సారథిగా ధోనీ ప్రథమ స్థానంలో ఉన్నాడు. మొత్తం 174 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మహీ 104 విజయాలందించాడు. ఇక గంభీర్ 129 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పరుగుల విషయంలో కూడా రోహిత్ 4898 థర్డ్ ప్లేస్‌లో నిలిచాడు.

ఐపీఎల్‌తో పోరాడలేం.. షెడ్యూల్ ప్రకారమే సీపీఎల్!

బెస్ట్ కెప్టెన్‌లుగా ధోనీ, రోహిత్..

బెస్ట్ కెప్టెన్‌లుగా ధోనీ, రోహిత్..

స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్ కనెక్టడ్ షోలో భాగంగా 50 మందితో కూడిన నిపుణుల జ్యూరీ కూడా ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్స్‌గా ధోనీ, రోహిత్‌లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 11 సీజన్లలో 10 సార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, మూడు సార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2013 నుంచి సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాలుగు సార్లు టైటిల్ అందించాడు. దీంతో ఈ ఇద్దరిని ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్స్‌గా ఎంపిక చేశారు.

Story first published: Monday, April 20, 2020, 8:59 [IST]
Other articles published on Apr 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+