న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనం తొలిసారి కలిసినప్పుడు.. దేవుడితో కరచాలనం చేసినట్లు అనిపించింది: యువీ

Yuvraj Singh Recalls First Meeting With Sachin Tendulkar

ముంబై: టీమిండియా ప్రపంచకప్‌ల హీరో, సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి బుధవారం నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. ప్రత్యేకంగా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో తొలినాటి అనుభవాలను షేర్‌ చేసుకున్నాడు. సచిన్‌ను తొలిసారి కలిసిన సందర్భంలో కరాచలనం చేస్తే.. అది దేవుడితో చేసినట్లే అనిపించిందని యువీ పేర్కొన్నాడు.

దేవుడితో కరచాలనం చేసినట్లు అనిపించింది:

దేవుడితో కరచాలనం చేసినట్లు అనిపించింది:

'ధన్యవాదాలు లిటిల్ మాస్టర్‌. మనం తొలిసారి కలిసినప్పుడు.. నేను దేవుడితో కరచాలనం చేసినట్లు అనిపించింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకు నడిపించావు. నా శక్తి సామర్థ్యాలపై నమ్మకం కలిగించావు. మీరు మార్గ నిర్దేశం చేసిన తీరు ఎప్పటికీ నాకు గుర్తే. మీరు నాతో ఎలా ఉన్నారో.. నేను కూడా యువకులతో అలానే ఉన్నా. మీతో మరిన్ని మధురజ్ఞాపకాలు పంచుకోడానికి ఎదురుచూస్తుంటా' అని యువరాజ్‌సింగ్‌ ట్వీట్‌ చేశాడు.

తొలిసారి చెన్నై శిక్షణ శిబిరంలో చూశా:

తొలిసారి చెన్నై శిక్షణ శిబిరంలో చూశా:

అంతకుముందు యువీతో తొలి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ సచిన్‌ స్పందించాడు. 'యువీ రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాది పూర్తయ్యింది. చెన్నై క్యాంప్‌లో యువీతో నా తొలి జ్ఞాపకం. అప్పుడు యువీకి నేను ఏమీ సాయం చేయలేకపోయా. అయితే యువీ వేగం, చురుకుదనం, అథ్లెటిక్‌ శరీరం తదితర అంశాలను అప్పట్లోనే గుర్తించా. అతని హిట్టింగ్‌ సామర్థ్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ మైదానంలోనైనా బంతిని స్టాండ్స్‌లోకి పంపించగలనని ప్రపంచానికి చాటి చెప్పాడు' అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

క్రికెటే నా జీవితం:

క్రికెటే నా జీవితం:

క్రికెటే తనకు ప్రాణమని, అభిమానులందరూ తనకు ఎంతో ముఖ్యమని సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ‘ప్రియమైన అభిమానులారా.. మీ ఆప్యాయతలో మునిగిపోయా.. కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎల్లప్పుడూ క్రికెటే నా జీవితంగా ఉంటుంది. మీలోని ప్రతి ఒక్కరూ నిత్యం నాలో భాగమై ఉంటారు' అని యువరాజ్‌ చెప్పాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్‌గా వెలుగొందిన యువీ.. గతేడాది జూన్‌ 10న అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

40 టెస్ట్ మ్యాచ్‌లు.. 1900 పరుగులు:

40 టెస్ట్ మ్యాచ్‌లు.. 1900 పరుగులు:

యువీ మొత్తం భారత్ తరఫున 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు చేసాడు. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

ఐపీఎల్‌ 2020కి సిద్ధంగా ఉండండి.. అవసరమైతే..: గంగూలీ

Story first published: Thursday, June 11, 2020, 14:16 [IST]
Other articles published on Jun 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X