న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా టెస్టుల్లో మ్యాచ్ విన్నర్ అవుతాడని 2013లోనే తెలుసు: యువరాజ్

Yuvraj Singh knew in 2013 Jasprit Bumrah would be a match winner for India in Tests

ముంబై: భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో మ్యాచ్ విన్నర్ అవుతాడని 2013లోనే తెలుసని మాజీ ఆల్ రౌండర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అన్నాడు. తాజాగా ముగిసిన విండీస్ పర్యటనలో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఐదు వికెట్లు, రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్‌తో సహా 6 వికెట్లు తీసాడు. దీంతో ప్రస్తుతం బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

పాకిస్థాన్‌ హెడ్ కోచ్‌గా మిస్బాకే పట్టం.. బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌

తరానికి ఒకడు:

తరానికి ఒకడు:

తాజాగా యువరాజ్ మాట్లాడుతూ... 'బుమ్రా ఒక క్లాస్ బౌలర్. అతనికి ఒక ప్రత్యేక శైలి ఉంది. అలాంటి బౌలర్ తరానికి ఒకడు ఉంటారు. 2013లో మొహాలిలోని పీసీఏ స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో అతడిని మొదటిసారి ఎదుర్కొన్నా. బుమ్రా వేసిన నాలుగు ఓవర్లు ఆడాను. అతడు టెస్టుల్లో టీమిండియా మ్యాచ్ విన్నర్ అవుతాడని అప్పుడే అనుకున్నా' అని యువరాజ్ తెలిపాడు.

అత్యుత్తమ బౌలర్లలో ఒకడు:

అత్యుత్తమ బౌలర్లలో ఒకడు:

'ప్రత్యేక బౌలింగ్‌ శైలి ఉన్న బుమ్రా టెస్టుల్లో రాణించగలడా? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మూడేళ్లుగా అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనలతో విమర్శకులకు సమాధానం చెప్పాడు. ప్రస్తుతం అతడు అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. విండీస్ పర్యటనలో బుమ్రా అద్భుత ప్రదర్శన చూసి మతిపోయింది' అని యువీ పేర్కొన్నాడు. బుమ్రా కేవలం 12 టెస్టుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఇప్పటివరకు ఆడిన ప్రతి విదేశీ పర్యటనలో 5 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 2018లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేసాడు.

ఎంతోమంది అమ్మాయిలకు మిథాలీ రాజ్ స్ఫూర్తి: పుజారా

https://telugu.mykhel.com/cricket/mithali-raj-retirement-you-are-an-inspiration-for-tons-of-girls-says-cheteshwar-pujara-023235.html

చెత్త మాటలు మాట్లాడకూడదు:

చెత్త మాటలు మాట్లాడకూడదు:

బుమ్రా బౌలింగ్‌ శైలిని తప్పుపడుతున్న వారికి సునీల్‌ గవాస్కర్‌ కూడా గట్టి సమాధానమిచ్చాడు. 'బుమ్రా బౌలింగ్ శైలి ప్రత్యేకమైనది. ఒక్కసారి అతడి రనప్‌ చూస్తే.. కొన్ని అడుగులు వేశాక వేగంగా వెళ్లి బంతిని వేస్తున్నాడు. ఈ సమయంలో బుమ్రా భుజం నేరుగా ఉంటోంది. నిబంధనల ప్రకారమే అతడు బౌలింగ్‌ వేస్తున్నాడు. అతడి శైలి బౌలింగ్ నియమాలకు లోబడి ఉంటుంది. నిజంగా కొంతమంది దీన్ని అద్దంలో చూడాలి. విమర్శకులు అదేపనిగా చెత్త మాటలు మాట్లాడకూడదు' అని గవాస్కర్‌ స్పందించాడు.

Story first published: Wednesday, September 4, 2019, 14:44 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X