న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌ హెడ్ కోచ్‌గా మిస్బాకే పట్టం.. బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌

Misbah-ul-Haq named Pakistan head coach and chief selector, Waqar Younis appointed as bowling coach

కరాచి: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్‌ హక్‌ పాక్‌ జట్టు హెడ్ కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా నియమితులయ్యారు. మరో మాజీ కెప్టెన్ వకార్ యూనిస్‌ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యారు. మిస్బా మరియు యూనిస్‌లకు జట్టు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఇద్దరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

వెస్టిండీస్ సిరీస్‌లో కోచ్ రవిశాస్త్రి సూచనలు పని చేశాయి: విహారి

మిస్బాకు మరో భాద్యత:

మిస్బాకు మరో భాద్యత:

పీసీబీ ఎంతో మందిని పరిశీలించినా.. మొదటి నుంచి కోచ్‌గా‌, చీఫ్‌ సెలక్టర్‌గా మిస్బాను నియమించడానికి ఆసక్తి చూపింది. చివరకు మిస్బాకే పట్టం కట్టింది. పీసీబీ మిస్బాకు మరో భాద్యత కూడా అప్పగించింది. మిస్బా సెలెక్టర్ల ఛైర్మన్‌గా కూడా ఎంపికయ్యారు. మిస్బా, యూనిస్‌ నియామకాలను పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి ఆమోదించారు.

ఏకగ్రీవంగా నియామకం:

ఏకగ్రీవంగా నియామకం:

ఇంతిఖాబ్ ఆలం, బాజీద్ ఖాన్, అసద్ అలీ ఖాన్, వసీం ఖాన్, జాకీర్ ఖాన్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ మిస్బాను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. ప్రపంచకప్‌ అనంతరం పాక్‌ జట్టు హెడ్ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ పదవీకాలం ముగియడంతో నూతన కోచ్‌గా మిస్బా ఎన్నికయ్యారు. చీఫ్‌ సెలక్టర్‌గా పదవీకాలం ముగియడంతో మాజీ కెప్టెన్ ఇంజమామ్ కూడా స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు మిస్బా లాహోర్‌లో ప్రీ సీజన్‌ కండిషనింగ్‌ క్యాంప్‌లో భాద్యతలు నిర్వర్తించాడు.

శ్రీలంక సిరీస్‌తో ఆరంభం:

శ్రీలంక సిరీస్‌తో ఆరంభం:

స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డే, మూడు టీ20 సిరీస్ ద్వారా మిస్బా-వకార్ కలిసి పనిచేయనున్నారు. ఈ టూర్ సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 9 వరకు జరుగుతుంది. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో వీరిద్దరి తొలి సిరీస్ ఆస్ట్రేలియాతో మొదలవుతుంది. ఆసీస్ పర్యటనలో పాక్ రెండు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్ట్ బ్రిస్బేన్‌లో (నవంబర్ 21-25), రెండో టెస్ట్ అడిలైడ్‌లో (29 నవంబర్ -3 డిసెంబర్) జరుగుతుంది.

ఎంతోమంది అమ్మాయిలకు మిథాలీ రాజ్ స్ఫూర్తి: పుజారా

2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు:

2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు:

మిస్బా పాకిస్థాన్‌ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. మిస్బా సారథ్యంలోనే పాకిస్థాన్‌ టెస్టుల్లో తొలిసారి మొదటి స్థానంకు చేరుకుంది. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనలో మిస్బా చివరి వరకు పోరాడిన విషయం తెలిసిందే. పాక్‌ తరఫున మిస్బా 76 టెస్టులు (5222), 162 వన్డేలు (5122), 39 టీ20 (788)లు ఆడాడు. 2015లో వన్డేలకు గుడ్‌బై చెప్పిన మిస్బా.. ఇక 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Wednesday, September 4, 2019, 13:07 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X