న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా సెంచరీకి.. జోష్‌కు ద్రవిడ్ సర్ వీడియోనే కారణం: యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal Says A Short Video From Rahul Dravid Sir Motivated Us

న్యూఢిల్లీ: అండర్-19 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన సెమీస్‌లో 10 వికెట్లతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం మెరుపులు మెరిపించిన యశస్వీ జైస్వాల్ పాక్‌పై అద్భుత సెంచరీతో రాణించాడు.

వారి సలహాలతోనే..

వారి సలహాలతోనే..

అయితే పాకిస్థాన్‌తో సెమీఫైనల్ అంటే.. సీనియర్‌‌ క్రికెటర్లే ఒత్తిడికి గురవుతారు. కానీ, యశస్వి జైస్వాల్‌‌ అలవోకగా సెంచరీ కొట్టి జట్టును గెలిపించాడు. ఇంత పెద్ద మ్యాచ్‌‌లో ఏ మాత్రం టెన్షన్‌‌ పడకుండా కూల్​గా పని పూర్తి చేశాడు. మ్యాచ్‌‌కు ముందు కోచ్‌‌లతో పాటు వెటరన్‌‌ క్రికెటర్‌‌ వసీం జాఫర్‌‌తో మాట్లాడడం, లెజెండరీ క్రికెటర్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌ పాత వీడియో మెసేజ్​ చూసి స్పూర్తి పొందడం వల్లే తాను బాగా ఆడానని యశస్వి చెప్పాడు.

పానీపూరి అమ్మినోడు.. పాక్‌ను పాతరేశాడు

ఆటపైనే ఫోకస్‌‌ పెట్టాలని

ఆటపైనే ఫోకస్‌‌ పెట్టాలని

‘ఈ మ్యాచ్​కు ముందు జట్టు ఆటగాళ్లమంతా రాహుల్‌‌ ద్రవిడ్‌‌ సర్‌‌ వీడియో చూశాం. అది ఎంతగానో మాలో స్పూర్తిని నింపింది. క్రికెట్‌‌ 22 గజాల పిచ్‌‌పైనే ఆడతారన్న విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని, దీన్ని కూడా మరో మ్యాచ్‌‌లానే భావించి ఆటపైనే ఫోకస్‌‌ పెట్టాలని ఆ వీడియోలో ద్రవిడ్ సర్ ఇచ్చిన సందేశం ఎంతగానో ఉపయోగపడింది. అలాగే, ఇక్కడి కోచ్‌‌లతో పాటు కెప్టెన్‌‌ ప్రియమ్‌‌ గార్గ్‌‌తో కలిసి వసీం (జాఫర్‌‌) భాయ్‌‌తో కూడా మాట్లాడా. వాళ్లందరూ నాకు ఒక్కటే చెప్పారు. మ్యాచ్‌‌లో ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపిస్తే.. తర్వాతి కొన్ని ఓవర్లు నిదానంగా ఆడమన్నారు. నీళ్లు తాగి, సింగిల్స్‌‌ కోసం ప్రయత్నించామని చెప్పారు. మెయిడిన్‌‌ అయినా సరే క్రీజులోనే ఉండమన్నారు. నేను అదే పని చేశా. 50 నుంచి 60 రన్స్‌‌ మధ్య నేను సింగిల్సే తీశా. మళ్లీ కాన్ఫిడెన్స్‌‌ వచ్చిన వెంటనే భారీ షాట్స్‌‌ కొట్టడం మొదలుపెట్టా.' అని జైస్వాల్‌‌ చెప్పుకొచ్చాడు.

ఇదో కొత్త అనుభవం..

ఇదో కొత్త అనుభవం..

ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడటం.. కిక్కిరిసిన మైదానాల్లో ఇండియా ఇండియా అరుపుల మధ్య ఆడటం తనకు తొలిసారని ఈ ముంబై సెన్సేషన్ చెప్పుకొచ్చాడు. ఇది తనకు ఒ కొత్త అనుభవమని తెలిపాడు.

‘పాకిస్థాన్‌తో ఆడటం నాకు ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో అభిమానులు భారత్.. భారత్ అని అరవడం.. ఈ వాతవారణం అత్యుద్భుతం. మొత్తంగా నాకు ఇది కొత్త అనుభవం. ప్రతీ ఓవర్ ఆడాలనే తాపత్రాయపడ్డాను. దివ్యాన్ష్ సక్సెనా కూడా అద్భుతంగా ఆడాడు. నాపై ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు.'అని జైస్వాల్ తెలిపాడు.

నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?

అలవోకగా...

అలవోకగా...

పాక్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ అలవోకగా గెలుపొందింది. యశస్వీ జైస్వాల్(113 బంత్లులో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105 నాటౌట్) సూపర్ సెంచరీకి తోడు.. దివ్యాన్ష్ సక్సెనా (99 బంతుల్లో 6 ఫోర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో చేలరేగడంతో దాయదీ పాక్ చిత్తయింది. ఫలితంగా అండర్-19 ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలో 10 వికెట్లతో నెగ్గిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా వరుసగా మూడో సారి ఫైనల్‌కు చేరింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ హైదర్ అలీ(56), కెప్టెన్ నజీర్(62), మహ్మద్ హారీస్(21) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా(3/28) మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అథర్వ అంకోలేకర్, యశస్వీ జైస్వాల్‌కు చెరో వికెట్ దక్కింది. అనంతరం 173 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 176 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

Story first published: Thursday, February 6, 2020, 14:50 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X