న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Points Table: యాషెస్‌లో రెండో విజయం.. టాప్-2లోకి ఆస్ట్రేలియా! పాక్ తర్వాత భారత్!

WTC Points Table: Here is how the points table looks like after 2nd Ashes Test match

దుబాయ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌(2021-23) పాయింట్స్ టేబుల్లో టాప్-2కి దూసుకెళ్లింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫస్ట్ సిరీస్ ఆడుతున్న ఆసీస్.. వరుసగా రెండు విజయాలతో 24 పాయింట్లను ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో శ్రీలంక(24 పాయింట్లు) కొనసాగుతుండగా.. మూడో స్థానంలో పాకిస్థాన్(36 పాయింట్లు), నాలుగో స్థానంలో భారత్(42 పాయింట్లు) నిలిచింది. విజయాల శాతం ఆధారంగా పాయింట్స్ టేబుల్ క్రమాన్ని నిర్ణయిస్తుండటంతో ఆసీస్, శ్రీలంక టాప్-2ను దక్కించుకున్నాయి.

డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా ఇప్పటి వరకూ శ్రీలంక, ఆస్ట్రేలియా రెండేసి మ్యాచ్‌లు ఆడగా.. రెండూ గెలిచాయి. దాంతో.. ఆ జట్ల గెలుపు శాతం 100గా ఉంది. అలానే భారత్ ఆరు మ్యాచ్‌లాడితే.. మూడింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడి, రెండింటిని డ్రా చేసుకుంది. దాంతో.. భారత్ గెలుపు శాతం 58.33 మాత్రమే.

సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌కి 12 పాయింట్లు చొప్పున కేటాయించిన ఐసీసీ.. సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్యపై మాత్రం పరిమితి విధించలేదు. అలానే టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి 12 పాయింట్లు, టై అయితే రెండు జట్లకీ చెరో 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లని కేటాయిస్తోంది. ఓడిన జట్టుకి పాయింట్లేమీ రావు. ఒకవేళ జట్లు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే? ఒక్కో ఓవర్‌కి ఒక్కో పాయింట్ చొప్పున కోత పడుతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ ఈ శిక్షకు గురైంది.

సోమవారం ముగిసిన అడిలైడ్ టెస్ట్‌లో ఆసీస్ 275 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 82/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 192 పరుగులకు కుప్పకూలింది. క్రిస్ వోక్స్(44), రోరీ బర్న్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా పేసర్ జై రిచర్డ్‌సన్(5/42) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనన్నాశాసించాడు. అతనికి తోడుగా మిచెల్ స్కార్క్(2/43), నాథన్ లయన్(2/55) రెండేసి వికెట్లు తీయగా.. మైకేల్ నేసర్ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన మార్నస్ లబుషేన్‌కు మ్యాన్ ఆఫ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ 2-0తో తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభంకానుంది.

Story first published: Monday, December 20, 2021, 19:40 [IST]
Other articles published on Dec 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X