న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: టీమిండియాకు కష్టాలు తప్పవు.. కోహ్లీసేన బలం అదే!

WTC Final: Ajit Agarkar gives England, Australia series examples to highlight Indias two biggest strengths

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాకు కఠిన సవాళ్లు ఎదురవుతాయని మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ పేస్‌ బౌలింగ్‌ బలంగా ఉందని, దానికి తోడు ఇంగ్లండ్‌లోని వాతావరణ పరిస్థితులు వారి సొంతం దేశంలాగే ఉంటాయన్నాడు. అలాగే కోహ్లీసేనకు ఇటీవలి కాలంలో ఎలాంటి టెస్టు క్రికెట్‌ ఆడిన అనుభవం లేకపోవడం, ఎలాంటి మ్యాచ్‌ ప్రాక్టీస్ లేకుండా నేరుగా బరిలోకి దిగడం సమస్యగా మారనుందని అగార్కర్‌ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ భారత జట్టుకు సవాళ్లు విసురుతాయని చెప్పాడు. అయితే ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా యువ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఈ విషయం స్పష్టమైందని, అదే కోహ్లీసేన బలమని చెప్పాడు.

న్యూజిలాండ్ బౌలింగ్

న్యూజిలాండ్ బౌలింగ్

జూన్ 18 నుంచి 23 వరకు సౌతాంప్టన్ వేదికగా ఈ టైటిల్ పోరు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరిన టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. ఇక స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో పాల్గొన్న అగర్కార్ ఈ ప్రతిష్టాత్మక ఫైనల్‌ నేపథ్యంలో ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు. 'న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. కైల్‌ జేమీసన్‌ లాంటి పొడవైన ఆటగాడు తన బౌలింగ్‌తో పరీక్ష పెడతాడు. తర్వాత ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌సౌథీ ఒక బంతిని ఇన్‌స్వింగ్‌ వేస్తే మరో బంతిని ఔట్‌స్వింగ్‌ వేస్తారు. మరోవైపు పిచ్‌ ఫ్లాట్‌గా ఉండి వికెట్లు దక్కని పరిస్థితుల్లో నీల్‌వాగ్నర్‌ బంతి అందుకొని ప్రభావం చూపిస్తాడు.

ప్రాక్టీస్ లేమి..

ప్రాక్టీస్ లేమి..

కొద్ది కాలంగా అతడు ఇదే పని చేస్తున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్‌లో ఆడటం వల్ల అది కూడా కివీస్‌ జట్టుకే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు అచ్చం న్యూజిలాండ్‌లో ఉన్నట్లే ఉంటాయి. ఇక డ్యూక్‌బాల్‌తో ఆడటం వల్ల వారి పని మరింత సులువు అవుతుంది. కాబట్టి టీమిండియా ముందు కఠిన సవాళ్లు ఉన్నాయి. మరోవైపు టీమిండియా ఇటీవల టెస్టు క్రికెట్‌ ఆడకపోవడం కూడా ఒక కారణం. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత స్వదేశంలో కాకుండా మరెక్కడా ఆడలేదు. దాంతో భారత జట్టుకు సరైన సన్నద్ధత లేకుండా పోయింది.'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీసేన బలం అదే..

కోహ్లీసేన బలం అదే..

ఇక టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ల సందర్భంగా తొలి మ్యాచ్‌లు ఓటమిపాలైనా తర్వాత బలంగా పుంజుకుందని అగార్కర్ చెప్పుకొచ్చా. ప్రధాన ఆటగాళ్లు విఫలమైనా క్లిష్ట పరిస్థితుల్లోనూ యవకులు రాణిస్తున్నారని, అదే కోహ్లీసేన బలమన్నాడు. 'స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ గురించి మాట్లాడుకుంటే.. భారత్ సులువుగా విజయం సాధిస్తుందనుకున్నాం. కానీ ఫస్ట్ మ్యాచ్‌లో ఓడింది. ఆ తర్వాత వరుసగా మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా భారత్ ఫస్ట్ మ్యాచ్‌లోనే చిత్తుగా ఓడింది. 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ గైర్హాజరీలోనూ దుమ్మురేపింది. ఆ సిరీస్‌లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్, సిరాజ్ అద్భుతంగా రాణించారు. ఇదే భారత్ బలం'అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, June 10, 2021, 21:18 [IST]
Other articles published on Jun 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X