న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటికే పాంటింగ్ రికార్డు బద్దలు.. ధోనీ రికార్డ్‌పై కన్నేసిన న్యూజిలాండ్ పేసర్! ఇంకో నాలుగు మాత్రమే!

WTC Final 2021: Tim Southee eye on MS Dhonis most sixes record in Tests

హైదరాబాద్: టీమిండియాతో సౌథాంప్టన్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా రెచ్చిపోయాడు. ఒక వికెట్‌తో పాటు 46 బంతుల్లో 30 పరుగులు చేశాడు. సౌథీ తన ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది.. చివరకు రవీంద్ర జడేజా బౌలింగ్‌‌లో చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కివీస్ అందుకోవడానికి కారణం సౌథీ చేసిన పరుగులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పాంటింగ్‌ రికార్డు బ్రేక్:

పాంటింగ్‌ రికార్డు బ్రేక్:

టిమ్ సౌథీ టెస్ట్ రికార్డు బాగా ఉంది. బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా రెచ్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకూ 79 టెస్టులాడిన సౌథీ.. 310 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్లు 12 సార్లు తీశాడు. ఇక బ్యాట్‌తో 87.74 స్ట్రైక్‌రేట్‌తో 1728 పరుగులు కూడా చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సౌథీ టెస్టుల్లో మొత్తం 167 ఫోర్లు, 75 సిక్సర్లు బాదాడు. ఛాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు బాదడంతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. ఈ మ్యాచుకు ముందువరకు ఇద్దరు 73 సిక్సర్లతో సమానంగా ఉన్నారు.

India vs Sri Lanka: కోచ్​ ప్రధాన బాధ్యత అదే.. ద్రవిడ్​ ఆ పని చేయగలడు: సచిన్

మరో 4 సిక్సర్లు కొడితే:

మరో 4 సిక్సర్లు కొడితే:

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్టుల్లో నెలకొల్పిన సిక్సర్ల రికార్డ్‌పై కూడా టిమ్ సౌథీ కన్నేశాడు. కెరీర్‌లో 90 టెస్టులాడిన ధోనీ 78 సిక్సర్లు బాదాడు. సౌథీ మరో 4 సిక్సర్లు కొడితే ధోనీ రికార్డ్ బ్రేక్ కానుంది. ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కాకపోయినా.. మరో 2-3 టెస్టుల్లో సౌథీ ఈ ఘనత అందుకోవడం ఖాయం. ఇక టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ టాప్‌లో ఉన్నాడు. మెక్‌కలమ్ 107 సిక్సర్లు బాదాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లతో ఐదో స్థానంలో.. ధోనీ 78 సిక్సర్లతో 15వ స్థానంలో ఉన్నారు. సౌథీ మరో నాలుగు సిక్సర్లు కొడితే.. టాప్-15లోకి రానున్నాడు. అప్పుడు ధోనీ 16కి పడిపోతాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే:

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే:

1) బ్రెండన్ మెక్‌కలమ్ - 101 మ్యాచ్‌ల్లో 107

2) ఆడమ్ గిల్‌క్రిస్ట్ - 96 మ్యాచ్‌ల్లో 100

3) క్రిస్ గేల్ - 103 మ్యాచ్‌ల్లో 98

4) జాక్వెస్ కలిస్ - 166 మ్యాచ్‌ల్లో 97

5) వీరేందర్ సెహ్వాగ్ - 104 మ్యాచ్‌ల్లో 91

6) బ్రియాన్ లారా - 131 మ్యాచ్‌లలో 88

7) క్రిస్ కైర్న్స్ - 62 మ్యాచ్‌ల్లో 87

8) వివియన్ రిచర్డ్స్ - 121 మ్యాచ్‌ల్లో 84

9) ఆండ్రూ ఫ్లింటాఫ్ - 79 మ్యాచ్‌ల్లో 82

10) మాథ్యూ హేడెన్ - 103 మ్యాచ్‌ల్లో 82

11) మిస్బా ఉల్ హక్ - 75 మ్యాచ్‌ల్లో 81

12) కెవిన్ పీటర్సన్ - 104 మ్యాచ్‌ల్లో 81

13) బెన్ స్టోక్స్ - 71 మ్యాచ్‌ల్లో 79

14) ఎంఎస్ ధోనీ - 90 మ్యాచ్‌ల్లో 78

15) టిమ్ సౌథీ - 79 మ్యాచ్‌ల్లో 75

16) రికీ పాంటింగ్ - 168 మ్యాచ్‌ల్లో 73

Story first published: Wednesday, June 23, 2021, 18:48 [IST]
Other articles published on Jun 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X