న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final 2021: ఎన్నో ఏళ్ల కల.. ఇప్పుడు తీరే! ఆనందంలో న్యూజిలాండ్‌!!

WTC Final 2021: New Zealand fullfill its dream to win ICC Trophy

హైదరాబాద్: ఎట్టకేలకు న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్‌ అందుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న న్యూజిలాండ్‌.. చివరకు టెస్టుల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్రోఫీని సొంతం చేసుకుంది. మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఒక్కసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ (2000)ని సొంతం చేసుకోవడం మినహా.. ఐసీసీ టోర్నీల్లో గెలిచిన రికార్డు లేని కివీస్ జట్టు.. సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో ముగింపు పలికింది.

ఫైనల్‌ గండాన్ని దాటలేకపోయింది

ఫైనల్‌ గండాన్ని దాటలేకపోయింది

1975 నుంచి వన్డే ప్రపంచకప్‌లో పోటీపడుతోన్న న్యూజిలాండ్‌ ఇప్పటికే 12 సార్లు మెగా టోర్నీలో బరిలో దిగింది. 2015, 2019 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచేలా కనిపించింది. కానీ ఫైనల్‌ గండాన్ని దాటలేకపోయింది. మరీ ముఖ్యంగా 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో మ్యాచ్‌ స్కోర్లు సమం కాగా.. సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగిసింది. దీంతో బౌండరీల తేడాతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంతో కివీస్‌కు నిరాశే ఎదురైంది. 2015, 2019 ప్రపంచకప్‌లలో అద్భుత ఆటతో కివీస్ ఆకట్టుకుంది.

1930లో టెస్టు హోదా

1930లో టెస్టు హోదా

న్యూజిలాండ్‌ టీ20 ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరలేకపోయింది. ఇక టెస్ట్ ఫార్మాట్‌ విషయానికి వస్తే.. 1930లో టెస్టు హోదా దక్కించుకున్న కివీస్ అదే ఏడాది ఇంగ్లండ్‌తో తన మొట్టమొదటి మ్యాచ్‌ ఆడింది. దశాబ్దాల నుంచి టెస్టుల్లో కొనసాగుతున్నప్పటికీ ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయించలేకపోయింది. అయితే ఇటీవలి కాలంలో కివీస్ గణనీయమైన ప్రగతి సాధించింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్‌ సారథిగా బాధ్యతలు చేపట్టాక జట్టు రాతే మారిపోయింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ ఈ ఏడాది జనవరిలో తొలిసారి టెస్టుల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆ స్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పుడు విశ్వ విజేతగా నిలిచింది. దీంతో ఆటగాళ్లతో పాటు ఆ జట్టు ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక వన్డే, టీ20ల్లో ప్రపంచకప్‌ అందుకుంటే. ఆ జట్టు కల పరిపూర్ణం అవుతుంది.

ICC Test Rankings: నంబ‌ర్‌వ‌న్‌ ఆల్‌రౌండర్‌ జడేజా.. 2017 తర్వాత ఇదే తొలిసారి!!

ప్రైజ్‌మనీతో పాటు గద

ప్రైజ్‌మనీతో పాటు గద

ఫైనల్లో రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా రిజర్వ్‌ డే కారణంగా ఉత్కంఠభరితంగా మారిపోయిన ఫైనల్లో న్యూజిలాండ్‌ 8వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 64/2తో బుధవారం ఆట కొనసాగించిన భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (41) టాప్‌ స్కోరర్‌.

మిగిలిన 53 కనీస ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 45.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (52 నాటౌట్‌), రాస్‌ టేలర్‌ (47 నాటౌట్‌) జట్టును గెలిపించారు. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తోపాటు గద (ట్రోఫీ) లభించింది. రన్నరప్‌ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.

Story first published: Thursday, June 24, 2021, 8:09 [IST]
Other articles published on Jun 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X