న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC 2021-2023 ఎప్పుడు స్టార్ట్ అవుతోందో తెలుసా?..గెలిస్తే ఎన్ని పాయింట్లు?స్లో ఓవర్‌ రేటుకు పెనాల్టీ!

WTC 2 to Begin With India-England Series, Here is complete details

హైదరాబాద్: క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి నిర్వ‌హించిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఇటీవలే ఘనంగా ముగిసింది. విశ్వవిజేతగా న్యూజిలాండ్‌.. రన్నరప్‌గా భారత్ నిలిచాయి. కరోనా వైరస్‌, బయో బుడగలు వంటి అడ్డంకులు ఎదురైనా.. డబ్ల్యూటీసీ 1 ఊహించిన దానికన్నా ఎక్కువే విజయవంతం అయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్ఠి డబ్ల్యూటీసీ-2పై పడింది. ఇది 2021-2023 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. దీనికోసం కొత్త పాయింట్ల వ్య‌వ‌స్థ‌ను, ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు, ఏ ఏ జట్లు ఆడబోతోంద‌న్న షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది. ఈసారి కేవ‌లం రెండు సిరీస్‌ల‌లో మాత్రం ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి.

ఆగ‌స్ట్ 4 నుంచి ఆరంభం

ఆగ‌స్ట్ 4 నుంచి ఆరంభం

డబ్ల్యూటీసీ-2 వ్యవధి రెండేళ్లు. 2021 ఆగస్టు నుంచి 2023 జూన్‌ వరకు జరుగుతుంది. ఫైనల్‌ ఎక్కడ జరుగుతుందో ఐసీసీ ఇంకా చెప్పలేదు. ఆగ‌స్ట్ 4 నుంచి భారత్, ఇంగ్లండ్ మ‌ధ్య ప్రారంభం కాబోయే ఐదు టెస్ట్‌ల ప‌టౌడీ ట్రోఫీతోనే డబ్ల్యూటీసీ-2 ప్రారంభం కానుంది. డ‌బ్ల్యూటీసీ 2లో ఈ సిరీస్‌తో పాటు డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే యాషెస్ సిరీస్‌లో మాత్రమే ఐదేసి టెస్టులు ఉండ‌నున్నాయి. ఇక భారత్, ఆస్ట్రేలియా మ‌ధ్య 2022లో ఇండియాలో జ‌ర‌గ‌బోయే సిరీస్‌లో మాత్ర‌మే 4 టెస్టులు ఉన్నాయి.

అత్య‌ధికంగా ఇంగ్లండ్ 21 టెస్టులు

అత్య‌ధికంగా ఇంగ్లండ్ 21 టెస్టులు

డబ్ల్యూటీసీ-2 టోర్నీలో 3 టెస్టుల సిరీసులు 7, రెండు టెస్టుల సిరీసులు 13 జరగనున్నాయి. తొలి డబ్ల్యూటీసీ మాదిరిగానే ఈసారీ 9 టెస్టు జట్లు ఆరు సిరీసుల్లో తలపడతాయి. విదేశాల్లో 3, స్వదేశంలో 3 ఉంటాయి. ఎక్కువ టెస్టులతో కూడిన సిరీసులు ఆడుతున్నవి మొత్తంగా భారత్‌, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే. మిగతా ఆరు జట్లు గరిష్ఠంగా 3 లేదా 2 మ్యాచుల సిరీసులే ఆడతాయి.

రెండో డ‌బ్ల్యూటీసీలో అత్య‌ధికంగా ఇంగ్లండ్ 21 టెస్టులు ఆడ‌బోతోంది. భారత్ (19), ఆస్ట్రేలియా (18), దక్షిణాఫ్రికా (15), పాకిస్థాన్‌ (14), న్యూజిలాండ్ (13) టెస్టులు ఆడుతాయి. వెస్టిండీస్‌, శ్రీలంక కూడా పదమూడేసీ ఆడనున్నాయి. 19 టెస్టుల్లో భారత్ సొంత‌గ‌డ్డ‌పై 9, విదేశాల్లో 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Tokyo Olympics 2021: ద్యుతీ చంద్​కు టోక్యో ఒలింపిక్స్ బెర్త్! ఎలాగంటే?

గెలిచిన జట్టుకు 12 పాయింట్లు

గెలిచిన జట్టుకు 12 పాయింట్లు

కరోనా వైరస్‌ వల్ల డబ్ల్యూటీసీ-1కి ఆటంకాలు ఎదురయ్యాయి. కొన్ని మ్యాచులు జరగలేదు. దాంతో పాయింట్ల పద్ధతిని ఐసీసీ మార్చేసింది. గెలిచిన జట్టుకు 12 పాయింట్లు కేటాయిస్తారు. డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు ఇస్తారు. గ‌తంలో టెస్టుల సంఖ్య‌తో సంబంధం లేకుండా సిరీస్‌కు 120 పాయింట్లు ఇచ్చేవారు. ఇక స్లో ఓవర్‌రేట్‌కు జరిమానా విధిస్తారు. నిర్దేశించిన సమయానికి మించి ఎన్ని ఓవర్లు వేస్తే.. అన్ని పాయింట్లు కోత విధిస్తారు. ఆడిన మ్యాచులు, గెలుపోటములు, పాయింట్ల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. వీటిని త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో ఆమోదించాల్సి ఉంది.

Story first published: Thursday, July 1, 2021, 10:47 [IST]
Other articles published on Jul 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X