న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's T20 Challenge:హర్మన్‌‌ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్.. అచ్చం చేపపిల్లలానే!

Womens T20 Challenge: Velocity beat Supernovas in second fixture

పుణే: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ గెలిచి జోరు కనబర్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్‌కు గట్టి షాక్ తగిలింది. దీప్తి శర్మ నేతృత్వంలోని వెలాసిటి జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సూపర్ నోవాస్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 71) హాఫ్ సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ తానియా బాటియా(36) అండగా నిలిచింది.

చివర్లో సునే లూస్(14 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించింది. టాప్-3 బ్యాటర్లు ప్రియా పూనియా(4), డియాండ్ర డాటిన్(6), హర్లీన్ డియోల్(7) దారుణంగా విఫలమవడంతో సూపర్ నోవాస్ 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్.. తానియా బాటితో కలిసి నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెలాసిటీ టీమ్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 51), లౌర వోల్వార్డ్‌ట్(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ దీప్తి శర్మ(24 నాటౌట్) విలువైన పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత క్యాచ్ అందుకుంది. ఓపెనర్ నట్టకన్ చాంతమ్(1) ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను హర్మన్ ప్రీత్ చేప పిల్లలా డైవ్ చేసి అందుకుంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సూపర్ బ్యాటింగ్‌తో పాటు కళ్లు చెదరి ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న హర్మన్ ప్రీత్ కౌర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Tuesday, May 24, 2022, 20:50 [IST]
Other articles published on May 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X