న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's Asia Cup 2022: భారత్ చేతిలో థాయ్‌లాండ్ చిత్తు.. స్నేహ్ రాణా ధాటికి 37 పరుగులకే ఆలౌట్!

 Womens Asia Cup 2022: Dominant India Thrash Thailand by 9 Wickets

సిల్హేట్(బంగ్లాదేశ్): మహిళల ఆసియాకప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీఫైనల్ చేరిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. సోమవారం థాయ్‌లాండ్ మహిళలతో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ టీమ్.. భారత బౌలర్ల ధాటికి 15.1 ఓవర్లలో 37 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఓపెనర్ నాన్నపట్(12) ఒక్కతే రెండు అంకెల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు.

నలుగురు బ్యాటర్లు అయితే ఖాతా కూడా తెరవలేదు. భారత పేసర్ స్నేహ్ రాణా(3/9) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ(2/10), రాజేశ్వరి గైక్వాడ్(2/8) రెండేసి వికెట్లు పడగొట్టారు. మేఘణ సింగ్ ఓ ఓవర్ మెయిడిన్ చేయడంతో పాటు(1/6) వికెట్ పడగొట్టింది. భారత అమ్మాయిల సూపర్ ఫీల్డింగ్‌కు థాయ్ బ్యాటర్లు ఇద్దరు రనౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కేవలం ఒక్కటంటే ఒక్కటే వైడ్ వేసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత అమ్మాయిలు 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేసి మరో 84 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. ధాటిగా ఆడే క్రమంలో ఓపెనర్ షెఫాలీ వర్మ(8) ఔటైనా... తెలుగు తేజం సబ్బినేని మేఘన(18 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్), పూజా వస్త్రాకర్(12 బంతుల్లో 2 ఫోర్లతో 12 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.

6 మ్యాచ్‌ల్లో 5 గెలిచిన భారత మహిళల జట్టు పాయింట్స్‌ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాక్ చేతిలోనే భారత్ ఓడిపోయింది. ఇక పాకిస్థాన్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో రెండో స్థానంలో ఉండగా.. శ్రీలంక మహిళల జట్టు కూడా 4 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. థాయ్‌లాండ్ మూడు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ఆడనున్నాయి. టాప్-3 బెర్త్‌లు దాదాపు ఖారారవ్వగా..నాలుగో స్థానం కోసం బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Story first published: Monday, October 10, 2022, 15:53 [IST]
Other articles published on Oct 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X