న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా, నువ్వు అది చేసే వచ్చావా?: ప్లకార్డుతో మహిళ నిరసన

Woman uses banner to troll Hardik Pandya over Koffee with Karan controversy

హైదరాబాద్: 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మహిళలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదం పాండ్యాను మాత్రం ఇప్పట్లో విదిలేలా లేదు. తొలి టీ20 అనంతరం జట్టులోని సహచర క్రికెటర్లతో కలిసి దిగిన ఫోటోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పాండ్యా పోస్టు చేస్తే... 'కొంచెం కాఫీ' అంటూ పాండ్యాను నెటిజన్లు ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే.

కెప్టెన్‌గా మిథాలీ: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపికకెప్టెన్‌గా మిథాలీ: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

రెండో టీ20 మ్యాచ్‌లో

రెండో టీ20 మ్యాచ్‌లో

తాజాగా ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో పాండ్యాకు వ్యతిరేకంగా ఓ మహిళ ప్లకార్డును పట్టుకుని నిరసన తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కాఫీ విత్ కరణ్'లో పాండ్యా వ్యాఖ్యలను ఎద్దేవా చేసేలా ప్లకార్డుపై ఆ మహిళ రాసింది.

‘పాండ్యా, ఆజ్ కర్కే ఆయా క్యా?

‘పాండ్యా, ఆజ్ కర్కే ఆయా క్యా?' (పాండ్యా, నువ్వు అది చేసే వచ్చావా?) అని ప్లకార్డులో రాసి మ్యాచ్ జరుగుతున్న సమయంలో పట్టుకుని తన నిరసన తెలిపింది. ప్రస్తుతం ఆమె ఫొటో, వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ప్లకార్డు పట్టుకున్న మహిళకు ‘భారత రత్న' ఇవ్వాలని సరదాగా కొంత మంది కామెంట్లు పెడుతుండగా.... మరికొందరు విభేదిస్తున్నారు.

పాండ్యాను క్షమించి జట్టులో చోటిచ్చిన బీసీసీఐ

పాండ్యాను క్షమించి జట్టులో చోటిచ్చిన బీసీసీఐ

బీసీసీఐ పాలకుల కమిటీ పాండ్యాను క్షమించి జట్టులో చోటిచ్చిన తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కొందరు హితవు పలుకుతున్నారు. ఈ వివాదం తర్వాత జట్టులోకి వచ్చి పాండ్యా జట్టులో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, ఈ కామెంట్లు మళ్లీ తన ఆటతీరుపై ప్రభావం చూపుతాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పోస్టు చేశారు.

న్యూజిలాండ్ పర్యటనలో పాండ్యా

న్యూజిలాండ్ పర్యటనలో పాండ్యా

పాండ్యా, కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న సమయంలో ‘కాఫీ విత్ కరణ్' ప్రసారమైంది. పాండ్యా, రాహుల్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో స్వదేశానికి వచ్చేయాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. ఆ తరవాత పాండ్యాను విచారించి, మందలించిన బీసీసీఐ వీరిద్దరిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసింది. ప్రస్తుతం పాండ్యా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు.

Story first published: Sunday, February 10, 2019, 11:54 [IST]
Other articles published on Feb 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X