న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలిసారి సచిన్‌ను తాకిన తర్వాత స్నానం చేయొద్దనుకున్నా: యువరాజ్ సింగ్

 When Yuvraj Singh refused to sit next to Sachin Tendulkar

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి తాకినప్పుడు గాల్లో తేలియపోయానని, స్నానం కూడా చేయొద్దనుకున్నానని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎదుర్కొన్న అనుభవాలను యువీ గుర్తు చేసుకున్నాడు. ఈ సిక్సర్ల సింగ్ పంచుకున్న జ్ఞాపకాలను'స్టోరీస్ బిహైండ్ ది స్టోరీ' పేరిట నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. 2000 సంవత్సరంలో యువరాజ్ సింగ్ భారత జట్టులోకి తొలి అడుగుపెట్టగా.. అప్పటికే సచిన్ క్రికెట్ రారాజుగా అందరి ప్రశంసలు అందుకున్నాడు.

షేక్ హ్యాండ్‌తో షేక్ అయ్యా..

షేక్ హ్యాండ్‌తో షేక్ అయ్యా..

ఆ ఏడాది అండర్ 19 వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడిన యువరాజ్ సింగ్ టీమిండియాకు ఎంపికయ్యాడు. అతనితో పాటు జహీర్ ఖాన్‌కు కూడా భారత జట్టులో అవకాశం లభించింది. అయితే తన చిన్ననాటి హీరో.. ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండుల్కర్ టీమ్ బస్సులో తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డానని యువీ గుర్తు చేసుకున్నాడు. ‘సచిన్ తొలిసారి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత స్నానం చేయాలనుకోలేదు. తన చేతులతో శరీరం మొత్తం తడుముకున్నా.'అని చెప్పాడు.

సచిన్ పక్కన నేనా?

సచిన్ పక్కన నేనా?

అండర్-19 తర్వాత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టిన తాను.. సచిన్, గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, శ్రీనాథ్ లాంటి గొప్ప ఆటగాళ్లను చూసి.. తానెక్కడ ఉన్నానని ఆశ్చర్యపోయానన్నాడు. కొత్తగా జట్టులోకి చేరిన తనకు, జహీర్ ఖాన్, విజయ్ దహియాలకు టీమ్ బస్సులో సచిన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఓ సందర్భంలో సచిన్ పక్క సీటు మాత్రమే ఖాళీగా ఉండటంతో.. అక్కడ తాను కూర్చోనని టీమ్ మేనేజర్‌కు చెప్పాను. తను ఇప్పుడు నీ టీమ్ మేట్. కాబట్టి నువ్వు మాట్లాడాల్సి ఉంటుందని మేనేజర్ చెప్పాడు. మెల్లగా వెళ్లి సచిన్‌‌ను అలాగే చూస్తూ.. వావ్ సచిన్ అనుకున్నానని'అని యువీ తెలిపాడు.

 నా కిట్ బ్యాగ్‌లో ఫొటో చూసి..

నా కిట్ బ్యాగ్‌లో ఫొటో చూసి..

తన కిట్ బ్యాగ్‌లోని ఫొటోను చూసి సచిన్ నవ్వాడని, ఎవరని అడిగాడని చెప్పుకొచ్చిన యువీ.. తాను అతనితో చనువుగా ఉండటానికి మాస్టర్ చేశాడన్నాడు.

‘నా కిట్ బ్యాగ్ తెరవగానే అందులో సచిన్ ఫొటో ఉంది. సచిన్ ఆ ఫొటోను చూసి.. ఫొటో బాగుంది. ఎవరా బ్యాట్స్‌మెన్ అని అడిగి నవ్వేశాడు. మా మధ్య చనువు పెరగడానికే సచిన్ అలా చేశాడు.' అని యువీ నెమరువేసుకున్నాడు. 2011 వరల్డ్ కప్ భారత్ గెలవగా... సచిన్ కెరీర్లో ఇదే ఏకైక వరల్డ్ కప్ అనే సంగతి తెలిసింది. వరల్డ్ కప్‌లో 362 రన్స్ చేసిన యువీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

విరాట్‌ కోహ్లీ నచ్చడు కానీ.. అతని బ్యాటింగ్‌ అంటే ఇష్టం: టిమ్‌పైన్‌

Story first published: Saturday, November 14, 2020, 15:33 [IST]
Other articles published on Nov 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X