న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మీరెప్పుడు క్యాంటీన్‌ తెరుస్తున్నారు? మీ కాఫీని మయాంక్ రుచి చూడాలని అనుకుంటున్నాడు'

When you open your canteen, Mayank wants to smell the coffee: Shastri’s reply to O’Keeffe’s jibe

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ కెర్రీ ఓకీఫ్ చేసిన 'క్యాంటీన్' వ్యాఖ్యలపై హెడ్ కోచ్‌ రవిశాస్త్రి కాస్తంత ఘాటుగా స్పందించాడు. బుధవారం మెల్ బోర్న్ వేదికగా ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో రంజీ క్రికెట్‌లో మయాంక్‌ చేసిన ట్రిపుల్ సెంచరీని ఓకీఫ్‌ చులకనగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

 కెర్రీ ఓకీఫ్ ఎగతాళి వ్యాఖ్యలపై

కెర్రీ ఓకీఫ్ ఎగతాళి వ్యాఖ్యలపై

అది ఓ ‘క్యాంటీన్‌ ఎలెవన్‌' జట్టుపై సాధించాడని ఎగతాళి చేశాడు. ఆ జట్టులోని బౌలర్లు వంటవారు, వడ్డించే వారై ఉంటారన్నాడు. అతడితో పాటు మార్క్‌ వా సైతం ఇలాగే మాట్లాడాడు. భారత్‌లో 50 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాలో 40 సమానం అవుతాయని అన్నాడు. వీరి వ్యాఖ్యలపై అదేరోజున భారత్ అభిమానులు మండిపడటంతో ఓకీఫ్ క్షమాపణలు కూడా చెప్పాడు.

ఖవాజా ఎంత పనిచేశావ్!: మయాంక్‌కి గాయం, నొప్పితో విలవిల (వీడియో)

 ఓకీఫ్ వ్యాఖ్యలపై రవిశాస్త్రి ఇలా

ఓకీఫ్ వ్యాఖ్యలపై రవిశాస్త్రి ఇలా

తాజాగా కెర్రీ ఓకీఫ్ వ్యాఖ్యలపై రవిశాస్త్రి స్పందించాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ "కెర్రీకి మయాంక్‌ ఓ సందేశం పంపాడు. మీరెప్పుడు క్యాంటీన్‌ తెరుస్తున్నారు? అతనొచ్చి మీ క్యాంటీన్‌లో ఓ కాఫీ తాగాలని అనుకుంటున్నాడు. భారత్‌లో రుచి చూసిన కాఫీతో పోల్చాలని భావిస్తున్నాడు. ఏ కాఫీ మెరుగ్గా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాడు" అని శాస్త్రి చురకలంటించాడు.

 తొలి ఇన్నింగ్స్‌లో జట్టుకు శుభారంభం

తొలి ఇన్నింగ్స్‌లో జట్టుకు శుభారంభం

కాగా, మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్ 161 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 76 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వైపు వికెట్లు పడుతున్నా... క్రీజులో పాతుకుపోయి (42: 102 బంతుల్లో 4 పోర్లు, 2సిక్సులు) పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాకు 399 పరుగుల భారీ లక్ష్యం

ఆస్ట్రేలియాకు 399 పరుగుల భారీ లక్ష్యం

దీంతో బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకి 399 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం 54/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది.

Story first published: Saturday, December 29, 2018, 10:00 [IST]
Other articles published on Dec 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X