న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఖవాజా ఎంత పనిచేశావ్!: మయాంక్‌కి గాయం, నొప్పితో విలవిల (వీడియో)

India vs Australia 3rd Test Day 4 : Mayank Agarwal Got Injured
Indian debutant Mayank Agarwal hurt in fielding incident during third Test at the MCG

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కి గాయమైంది. ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో శనివారం బ్యాట్స్‌మెన్‌కి అతి సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్‌‌ని బంతి బలంగా తాకింది. దీంతో కాసేపు నొప్పితో విలవిలలాడాడు.

బాక్సింగ్ డే టెస్టు: ఆసీస్ విజయ లక్ష్యం 399, విజయం దిశగా భారత్బాక్సింగ్ డే టెస్టు: ఆసీస్ విజయ లక్ష్యం 399, విజయం దిశగా భారత్

అనంతరం ఫిజియో సూచన మేరకు అతడు మైదానాన్ని వీడాడు. మెల్‌బోర్న్‌ వేదికగా బుధవారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టుతో మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్ టెస్టులో నాలుగో రోజైన శనివారం.. 399 పరుగుల లక్ష్యఛేదనకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 33 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది.

1
43625
 భారత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఖవాజా

భారత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఖవాజా

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (33) దూకుడుగా ఆడుతూ కాసేపు భారత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా బ్యాటింగ్ చేస్తుండగా షార్ట్ లెగ్‌లో మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్ కోహ్లీ ఫీల్డింగ్‌కి ఉంచాడు.

ఉస్మాన్ ఖవాజా స్వీప్ షాట్

ఆ ఓవర్‌ రెండో బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా జడేజా విసరగా.. ఉస్మాన్ ఖవాజా స్వీప్ షాట్ ఆడాడు. దీంతో బంతి వేగంగా మయాంక్ అగర్వాల్ శరీరంపైకి దూసుకురావడంతో పాటు అతని మెడ భాగంలో బలంగా తాకింది. బంతి అతనికి తాకడంతో గాయమైందా? అని స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రహానే, కెప్టెన్ కోహ్లీ పరిశీలించేందుకు ప్రయత్నించారు.

 సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కేఎల్ రాహుల్

సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కేఎల్ రాహుల్

దీంతో నొప్పితో విలవిలలాడుతూ కనిపించిన మయాంక్ వారిని పట్టుకోనివ్వలేదు. వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో గాయాన్ని పరిశీలించి.. చికిత్స కోసం మయాంక్‌ని స్టేడియం బయటకు తీసుకెళ్లాడు. దీంతో అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కేఎల్ రాహుల్ మైదానంలోకి వచ్చాడు. ఈ సిరిస్‌లో ఇప్పటికే యువ ఓపెనర్ పృథ్వీ షా గాయంతో సిరీస్‌ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే.

 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసిన ఆసీస్

వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసిన ఆసీస్

అనంతరం ఉస్మాన్ ఖవాజా (33) కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లో జట్టు స్కోరు 63 వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం 28 ఓవర్లకు గాను ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. క్రీజులో షాన్ మార్ష్ (25), ట్రావిస్ హెడ్ (15) పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 306 పరుగులు చేయాల్సి ఉంది.

Story first published: Saturday, December 29, 2018, 9:12 [IST]
Other articles published on Dec 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X