న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌ లక్ష్యం 468.. భారత్ విజయానికి 8 వికెట్లు

West Indies vs India, 2nd Test: Rahane, Vihari fifties help India set a massive 468-run target for West Indies

కింగ్‌స్టన్‌: విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ విజయం దిశగా దూసుకెళుతోంది. భారత్‌ మూడో రోజే ఆఖరి టెస్టును శాసించే స్థితిలో నిలిచింది. ఇక భారత్ విజయానికి కేవలం 8 వికెట్ల దూరంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో భారత్ విజయం ఖాయం. అయితే అది నాలుగో రోజు అవుతుందో, చివరి రోజు అవుతుందో చూడాలి. భారీ లక్ష్యంను ముందు ఉండడంతో విండీస్ బ్యాట్స్‌మన్‌ భారత బౌలర్లను ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి. ముఖ్యంగా పేసర్‌ బుమ్రాను ఎదుర్కోవడం సవాలే.

గాఫ్‌ జోరుకు ఒసాకా బ్రేక్‌.. బార్టీకి షాక్.. క్వార్టర్స్‌లో ఫెడరర్‌గాఫ్‌ జోరుకు ఒసాకా బ్రేక్‌.. బార్టీకి షాక్.. క్వార్టర్స్‌లో ఫెడరర్‌

విజయానికి 423 పరుగులు:

విజయానికి 423 పరుగులు:

468 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా విండీస్ ఓపెనర్లు విఫలమయ్యారు. బ్రాత్‌వైట్ (3) ఇషాంత్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ క్యాంప్‌బెల్‌ (16) డారెన్‌ బ్రేవోతో కలిసి ఆదుకునే ప్రయత్నం చేసాడు. కానీ.. షమీ వేసిన అద్భుత బంతికి కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో బ్రూక్స్‌తో కలిసి బ్రేవో వికెట్లను అడ్డుకున్నాడు. ఆట ముగిసే సమయానికి క్రీజులో బ్రేవో(18), బ్రూక్స్‌ (4) ఉన్నారు. విండీస్ విజయానికి ఇంకా 423 పరుగులు అవసరం.

మరో 30 పరుగులు చేసి ఆలౌట్:

మరో 30 పరుగులు చేసి ఆలౌట్:

ఓవర్‌నైట్‌ స్కోరు 87/7తో మూడోరోజు ఆట కొనసాగించిన విండీస్‌ మరో 30 పరుగులు చేసి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు షమీ విజృంభించాడు. బుమ్రా ధాటికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా 6 వికెట్లు తీయగా.. షమీ 2 వికెట్లు తీసాడు. దీంతో టీమిండియాకు 299 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

ఫాలోఆన్‌ ఇవ్వకుండా:

ఫాలోఆన్‌ ఇవ్వకుండా:

భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినా.. ఫాలోఆన్‌ ఇవ్వకుండా టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం చేసిన మయాంక్‌ అగర్వాల్‌ (4) త్వరగానే ఔట్‌కాగా.. క్రీజులో నిలిచేందుకు యత్నించిన లోకేశ్‌ రాహుల్‌ (63 బంతుల్లో 6) విఫలమయ్యాడు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) తొలి బంతికే కీపర్‌ హామిల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో టీమిండియా 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

శ్రీకాంత్, నితీష్ మెరుపులు.. బెంగాల్‌పై యూపీ గెలుపు

మళ్లీ ఆదుకున్న రహానే, విహారి:

మళ్లీ ఆదుకున్న రహానే, విహారి:

ఈ దశలో టెస్టు స్పెషలిస్టులు చతేశ్వర్‌ పుజరా.. అజింక్య రహానేలు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ జోడి కాసేపు కుదురుగా ఆడటంతో వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడింది. అయితే.. కీలక దశలో హోల్డర్‌ వేసిన బౌన్సర్‌కు పుజారా (27) ఔటయ్యాడు. దీంతో భారత్‌ 57/4తో నిలిచింది. ఈ సమయంలో రహానేకు విహారి తోడయ్యాడు. ఇద్దరూ విండీస్ బౌలర్లను ఎదుర్కుంటూ అర్ధ సెంచరీలు చేశారు. ఈ జోడి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసాడు. దీంతో భారత్ 467 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, September 2, 2019, 12:04 [IST]
Other articles published on Sep 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X