న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి.. ఒక ఇన్నింగ్స్‌లో 12 మంది బ్యాటింగ్!!

India vs West Indies 2019 : 12 Batsmen Bat In The Same Innings Of A Test - That's A First
West Indies vs India: 12 batsmen bat in the same innings of a Test

కింగ్‌స్టన్‌: భారత్‌తో జరిగిన రెండవ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో గాయపడిన డారెన్ బ్రావోకు కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా జెర్మైన్ బ్లాక్‌వుడ్‌ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బ్లాక్‌వుడ్‌ (38;72బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బ్రూక్స్‌ (50)తో కలిసి పోరాడడంతో భారత్‌ విజయం కాస్త ఆలస్యం అయింది.

'కోహ్లీ ఆర్థిక సహాయం చేయకుంటే.. ఏం సాధించేవాడిని కాదు''కోహ్లీ ఆర్థిక సహాయం చేయకుంటే.. ఏం సాధించేవాడిని కాదు'

ఒక ఇన్నింగ్స్‌.. 12 మంది బ్యాటింగ్:

ఒక ఇన్నింగ్స్‌.. 12 మంది బ్యాటింగ్:

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బ్లాక్‌వుడ్‌ క్రీజులోకి రావడంతో.. విండీస్ జట్టులో 12 మంది బ్యాటింగ్ చేసినట్టు అయింది. ఇలా ఒక ఇన్నింగ్స్‌లో 12 మంది బ్యాటింగ్ చేయడం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే మొదటిసారి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 12 మంది బ్యాటింగ్ చేయడం అనేక సందర్భాల్లో చూసినా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఇదే మొదటిసారి. దీంతో బ్లాక్‌వుడ్‌, విండీస్ జట్టు రికార్డుల్లోకి ఎక్కింది.

 రెండో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా:

రెండో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా:

మరోవైపు బ్లాక్‌వుడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా కూడా రికార్డుల్లోకి ఎక్కాడు. మూడో రోజు ఆటలో భారత పేసర్ బుమ్రా వేసిన బౌన్సర్ బ్రావో హెల్మెట్‌కు బలంగా తాకింది. రెండు బంతులు ఆడిన అనంతరం ఆ రోజు ఇన్నింగ్స్ ముగిసింది. ఇక నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే బ్రావో కొంచెం అసౌకర్యంగా కనిపించాడు. మూడు ఓవర్లు ఆడి 5 పరుగులు చేసాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. బ్రావో స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బ్లాక్‌వుడ్‌ వచ్చాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం:

ఐసీసీ నిబంధనల ప్రకారం:

ఇటీవలే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఐసీసీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. టెస్టు షెడ్యూల్ ప్రకారం తుది 15 మంది సభ్యులతో కూడిన విండీస్ జట్టులో బ్లాక్‌వుడ్‌కు చోటు లేదు. అయినప్పటకీ ఐసీసీ నిబంధనల ప్రకారం అతడికి బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆసీస్ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ మొదటి సారిగా కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

సొంత గడ్డపై టెస్ట్ ఆడలేదు.. దానికోసం ఎదురుచూస్తున్నా: విహారి

సిరీస్‌ కైవసం:

సిరీస్‌ కైవసం:

ఈ మ్యాచ్‌లో భారత్ 257 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్స్‌ (50) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బ్లాక్‌వుడ్‌ (38), హోల్డర్‌ (39) పరుగులు చేశారు. మహ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా గెలిచింది.

Story first published: Tuesday, September 3, 2019, 14:14 [IST]
Other articles published on Sep 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X