Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సొంత గడ్డపై టెస్ట్ ఆడలేదు.. దానికోసం ఎదురుచూస్తున్నా: విహారి

West Indies vs India: Hanuma Vihari looks forward to playing in-front of home crowd

కింగ్‌స్టన్‌: సొంత గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నా. సొంత పేక్షకుల మధ్య ఆడడం చాలా బాగుంటుంది అని తెలుగు తేజం హనుమ విహారి పేర్కొన్నాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీంఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 257 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

భారీ స్కోరు చేయాలనుకున్నా:

భారీ స్కోరు చేయాలనుకున్నా:

సెంచరీ, అర్ధ సెంచరీతో సత్తా చాటిన హనుమ విహారి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'తొలి టెస్ట్ సెంచరీ సాధించడం చాలా గొప్పగా ఉంది. గత మ్యాచ్‌లో సెంచరీ ముందు ఔట్ అయ్యాను. ఈసారి ఎలా అయినా భారీ స్కోరు చేయాలని నిర్ణయించుకున్నా. 200 పరుగులకు 5 వికెట్లు కోల్పోయినప్పుడు రిషబ్ పంత్ అండతో పరుగులు చేయాలనుకున్నా. ఫాస్ట్ బౌలర్లకు ఈ వికెట్‌ అనుకూలిస్తున్న నేపథ్యంలో ఓపిక పట్టా. అయితే స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగడం ఫలితాన్ని ఇచ్చింది' అని విహారి తెలిపాడు.

ఎంతో త్రిల్‌గా ఉంది:

ఎంతో త్రిల్‌గా ఉంది:

'ఇప్పటివరకు 6 టెస్ట్ మ్యాచులు ఆడాను. సొంత గడ్డపై ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నా. సొంత పేక్షకుల మధ్య ఆడడం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ ఫిలింగ్ తలుచుకుంటే ఎంతో త్రిల్‌గా ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికి స్వేచ్ఛను ఇచ్చాడు. డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మరిన్ని మంచి ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నిస్తా' అని విహారి అన్నాడు.

నాన్నకు అంకితం:

నాన్నకు అంకితం:

'ఇదో భావోద్వేగమైన రోజు. నాకు 12 ఏళ్ల వయస్సులో మా నాన్న చనిపోయాడు. భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఆయన ఎక్కడున్నా ఈ రోజు నా ఆట చూసి గర్వించే ఉంటారు. ఈ ఇన్నింగ్స్ ఆడడం సంతోషంగా ఉంది. ఈ సెంచరీలో ఇషాంత్‌ భాగస్వామ్యం కూడా ఉంది. నాకంటే కూడా ఇషాంతే అసలైన బ్యాట్స్‌మన్‌గా కనిపించాడు' అని మూడో రోజు మ్యాచ్ అనంతరం విహారి చెప్పుకొచ్చాడు.

257 పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్‌ క్లీన్ స్వీప్

రోహిత్ శర్మకు కష్టమే:

రోహిత్ శర్మకు కష్టమే:

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రహానే అండగా రెచ్చిపోయిన విహారి.. రెండో టెస్టులో సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకున్నా అదరగొట్టాడు. విండీస్ పేసర్లు హోల్డర్, రోచ్ నిప్పులు చెరుగుతున్నా.. ఏ మాత్రం తడబడకుండా సూపర్ సెంచరీ (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) చేసాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా కీలక అర్ధ శతకం చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు రోహిత్ శర్మ టెస్టు అవకాశాలను మరింత సంక్లిష్టం చేశాడు.

Story first published: Tuesday, September 3, 2019, 12:42 [IST]
Other articles published on Sep 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+