న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్థానిక అంపైర్లు వద్దు.. తటస్థ అంపైర్లు ముద్దు: జేసన్ హోల్డర్

West Indies Captain Jason Holder Questions Use Of Home Umpires

వెల్లింగ్టన్: కరోనా విపత్కర పరిస్థితుల్లో తటస్థ అంపైర్లకు బదులు స్థానిక అంపైర్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనపై వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇరు దేశాలకు చెందిన అధికారులు ఉంటేనే మ్యాచ్‌లు ఫెయిర్‌గా జరుగుతాయన్నాడు. న్యూజిలాండ్‌తో సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో విండీస్ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హోల్డర్.. ఈ సిరీస్‌పై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవంటూనే.. తటస్థ అంపైర్లుండేలా చూడాలని ఐసీసీని కోరాడు.

 ఫెయిర్‌గా సాగాలంటే..

ఫెయిర్‌గా సాగాలంటే..

ఆటగాళ్లందరూ ఇతర దేశాలకు ప్రయాణిస్తూ క్వారంటైన్ పాటిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులకు వచ్చిన కష్టం ఏంటని హోల్డర్ ప్రశ్నించాడు.‘అసలు తటస్థ అంపైర్లకు అవకాశం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు. జట్టుగా ఆటగాళ్లంతా ప్రయాణాలు చేస్తూ క్వారంటైన్ పాటిస్తున్నారు. అదే అంపైర్లు కూడా చేయవచ్చు. ఆటగాళ్లలాగే ప్రయాణాలు చేస్తూ క్వారంటైన్ పాటించవచ్చు.

క్లిష్ట నిర్ణయాలుంటాయి..

క్లిష్ట నిర్ణయాలుంటాయి..

టెస్ట్ సిరీస్‌లో చాలా సందేహాస్పదకమైన నిర్ణయాలు, సవాళ్లతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాచ్ ఫెయిర్‌గా సాగాలంటే ఇరు దేశాల అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు ఉండటం ఉత్తమం. ఈ నిబంధనపై ఐసీసీ మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.'అని హోల్డర్ అభిప్రాయపడ్డాడు. తటస్థ అంపైర్ల నిర్ణయాన్ని ఐసీసీ 26 ఏళ్ల కిందనే ప్రవేశపెట్టినప్పటికీ.. కరోనా కారణంగా ఆ నిబంధనను తాత్కలికంగా మార్చింది. ఉమ్మి వాడకుండా నిషేధం విధించింది. అలాగే స్థానిక అంపైర్లకు అనుభవం తక్కువగా ఉండటంతో నిర్ణయాల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంటుందని భావించి అదనపు రివ్యూకు అవకాశం ఇచ్చింది.

విజయం లేకుండానే..

విజయం లేకుండానే..

ఇక న్యూజిలాండ్ పర్యటనను విండీస్ వీరులు విజయం లేకుండానే ముగించారు. తొలుత మూడు టీ20ల సిరీస్‌ను 0-2తో చేజార్చుకున్న కరీబియన్లు.. తాజాగా రెండు టెస్టుల సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్‌కు గురయ్యారు. 244/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ 317 పరుగులకు ఆలౌటైంది. జాన్‌ క్యాంప్‌బెల్‌ (109 బంతుల్లో 68; 8 ఫోర్లు), కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ (89 బంతుల్లో 60 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ చెరో మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. టిమ్ సౌతి, కైల్ జేమీసన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Story first published: Monday, December 14, 2020, 12:54 [IST]
Other articles published on Dec 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X