న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

20 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున హోల్డర్ అరుదైన ఘనత!

 West Indies Captain Jason Holder moves up to second spot in ICC rankings


దుబాయ్‌:
వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్.. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. దీంతో గత 20 ఏళ్లలో విండీస్ తరఫున ఏ బౌలర్ సాధించని ఘనతను అతను సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో తొలిసారి 862 రేటింగ్ పాయింట్లు సాధించిన హోల్డర్.. లెజెండ్ కోట్నివాల్ష్(866) తర్వాతి స్థానాన్ని సంపాదించాడు. 2000లో వాల్ష్‌ ఈ ఫీట్ అందుకున్నాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఏడు వికెట్లు తీయడం హోల్డర్ ర్యాంకింగ్ మెరుగుదలకు చాలా దోహదపడింది. ప్యాట్‌ కమిన్స్‌ (ఆసీస్‌) తొలి స్థానంలో ఉండగా.. భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఏడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో స్టీవ్‌ స్మిత్‌, విరాట్ కోహ్లీ కోహ్లీ టాప్‌-2 ఆటగాళ్లుగా కొనసాగుతుండగా పుజారా ఏడు, రహానె తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు.

ఇంగ్లండ్ తాత్కలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా తొమ్మిదో ర్యాంకులో ఉన్నా.. రహానే, స్టోక్స్‌కు దశాంశమానం తేడా ఉంది. ఆల్‌రౌండర్ కేటగిరిలో హోల్డర్(485) టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. జడేజా(397), అశ్విన్ (281) వరుసగా మూడు, ఐదు ర్యాంకుల్లో ఉన్నారు.

కరోనా నేపథ్యంలో సుమారు మూడు నెలలు, 117 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బయోబబుల్ వాతావరణంలో ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్ట్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. తొలి రోజు ఒక్కరోజు వరణుడు ఆటంకం కలిగించనా.. మిగిలిన నాలుగు రోజులు ఆట సాఫిగానే సాగింది. అనేక మలుపులు తిరిగి అభిమానులకు కావాల్సిన మజానిచ్చింది. ఇక మ్యాచ్‌లో విజయం సాధించిన వెస్టిండీస్ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

టెన్షన్ తగ్గడానికి వరల్డ్‌కప్ ఫైనల్లో సిగరేట్ తాగిన బెన్ స్టోక్స్!టెన్షన్ తగ్గడానికి వరల్డ్‌కప్ ఫైనల్లో సిగరేట్ తాగిన బెన్ స్టోక్స్!

Story first published: Wednesday, July 15, 2020, 8:02 [IST]
Other articles published on Jul 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X