న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CPL 2020: పాపం ఫాబియన్‌.. ఫ్లైట్‌ మిస్సయి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు!

West Indies All-rounder Fabian Allen Ruled Out of CPL 2020 After Missing Flight

బార్బడోస్‌: అప్‌కమింగ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2020 సీజన్‌కు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలెన్‌ దూరమయ్యాడు. సీపీఎల్‌లో పాల్గొనేందుకు అలెన్‌ జమైకా నుంచి బార్బడోస్‌ వెళ్లాల్సి ఉంది. గత సోమవారం అతను సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోవడంతో ఫ్లైట్‌ మిస్సయ్యాడు. దీంతో టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

సీపీఎల్‌ 2020 సీజన్‌లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ తరఫున అలెన్ ఆడాల్సి ఉంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం చార్టర్‌ విమానాలలో తప్ప ఎవరు దేశంలోకి రావడానికి, వెళ్లడానికి అనుమతి లేదు. ఈ కారణంతోనే ఈ విండీస్ ఆల్‌రౌండర్‌ సీపీఎల్ టోర్నీలో పాల్గొనలేకపోతున్నాడు.

'దురదృష్టవశాత్తు ఫ్లైట్‌కు సంబంధించిన వివరాలను అర్థం చేసుకోవడంలో అలెన్ కొంత అయోమయానికి గురయ్యాడు. మేం అన్ని విధాల ప్రయత్నించాం. కానీ కరోనా కారణంగా ట్రినిడాడ్‌లో విధించిన కఠిన నిబంధనలతో చార్టర్ ఫ్లైట్‌లో వెళ్లాల్సిన ఏకైక అవకాశాన్ని అలెన్ చేజార్చకున్నాడు.'అని అలెన్ సన్నిహితుడు ఒకరు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ ఫోకు తెలిపారు.

ఇకఈ టోర్నీలో పాల్గొనడానికి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు వెళ్లిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్‌ అధికారులు, నిర్వాహకులతో కూడిన మొత్తం 162 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. వీళ్లంతా అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ సమయంలో వారందరికి పలుమార్లు పరీక్షలు జరపనున్నారు. ప్రస్తుతానికి చేసిన టెస్ట్‌లో అందరికి నెగటీవ్ వచ్చిందని సీపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక ఆగస్టు 18న ప్రారంభం కానున్న సీపీఎల్ 2020 సీజన్.. సెప్టెంబర్ 10 వరకు జరగుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో టోర్నీ మొత్తం బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్​, టొబాగోలలో జరుగనుంది. మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక భారత్‌లో సీపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. స్టార్స్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీ‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

పాక్ క్రికెటర్లను తొక్కేస్తున్నారు.. బాబర్ అజమ్ కోహ్లీ అయ్యుంటేనా..పాక్ క్రికెటర్లను తొక్కేస్తున్నారు.. బాబర్ అజమ్ కోహ్లీ అయ్యుంటేనా..

Story first published: Friday, August 7, 2020, 14:17 [IST]
Other articles published on Aug 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X