స్టన్నింగ్ క్యాచ్‌తో రోహిత్ శర్మను ఔట్ చేసిన షకీబ్ (వీడియో)

Posted By:
 Shakib al hasan

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ ఔటయ్యే ప్రమాదం నుంచి బయట పడ్డాడు. భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

అతడి స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న సందీప్ శర్మ మొదటి ఓవర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో సందీప్ శర్మ వేసిన మొదటి ఓవర్‌ తొలి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో నాలుగో బంతిని రోహిత్ భారీ షాట్‌గా ఆడగా... అది ఎడ్జ్ తీసుకొని మిడ్ వికెట్ దిశగా గాల్లో ఎగిరింది.

వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చిన దీపక్ హుడా దానిని అందుకోవడంలో ఫీల్డర్ దీపక్ హుడా విఫలమయ్యాడు. అదే ఓవర్ అఖరి బంతికి మరో ఓపనర్ ఎవిన్ లూయిస్ పరుగు తీసేందుకు పిచ్ మధ్య వరకూ వచ్చాడు. అదే సమయంలో బంతిని వికెట్లకు తగిలేలా విసరలేకపోయాడు.

హైదరాబాద్ v ముంబై లైవ్ స్కోరు కార్డు

ఇక, మొదటి ఓవర్‌లో లైఫ్ లభించడంతో రెచ్చిపోయిన రోహిత్ (11) స్టాన్లేక్ విసిరిన మరుసటి ఓవర్లో ఓ సిక్స్, ఫోర్‌తో దూకుడు పెంచే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత స్టాన్‌లేక్ విసిరిన ఆఖరి బంతికి ఆన్ సైడ్ మీదుగా షాట్ ఆడగా దానిని అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్ అల్ హసన్ దానిని అద్భుతంగా అందుకున్నాడు.

మొదటి ఓవర్‌లో తేలికైన క్యాచ్‌ను దీపక్ హుడా వదిలేయగా.. షకీబ్ మాత్రం ముందుకు డైవ్ చేస్తూ అద్భుత ఫీల్డింగ్‌తో రోహిత్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సన్‌రైజర్స్ విజయ లక్ష్యం 148
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్‌కు 148 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆది నుంచి తడబాటుకు గురైంది.

సన్‌రైజర్స్‌ బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేయడంతో ముంబై ఇండియన్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(29), కీరోన్‌ పొలార్డ్‌(28), సూర్యకుమార్‌ యాదవ్‌(28)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, రోహిత్‌ శర్మ(11), కృనాల్‌ పాండ్యా(15)లు నిరాశపరిచారు.

మ్యాచ్‌ రెండో ఓవర్‌లోనే స్టాన్‌లేక్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ పెవిలియన్‌కు చేరాడు. వన్ డౌన్‌ వచ్చిన ఆటగాడు ఇషాన్‌ కిషాన్‌(9) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కాసేపు లూయిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మూడు ఫోర్లు, రెండు సిక‍్సర్లతో ముంబై అభిమానుల్ని అలరించాడు.

జట్టు స్కోరు 54 పరుగుల వద్ద లూయిస్‌ అవుట్‌ కావడంతో ముంబై స్కోరులో వేగం తగ్గింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కీరోన్‌ పొలార్డ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు దూకుడుగా ఆడే క్రమంలో ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, స్టాన్‌లేక్, సిద్ధార్ తలో రెండు వికెట్లు తీసుకోగా... రషీద్, షకీబ్ తలో వికెట్ తీసుకున్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 21:10 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి