CSK intra-squad practice: బౌలర్లను చితక్కొట్టిన ధోనీ, రాయుడు, వాట్సన్! (వీడియో)

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ సందడి మొదలైంది. ఎన్నో ఆటంకాలు.. మరెన్నో అడ్డంకులను అధిగమించిన ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. కరోనా దెబ్బకు భారత్‌ను వదిలి యూఏఈకి తరలిన ఈ ధనాధన్ లీగ్.. ఎడారి హీట్‌‌లో.. అరేబియన్‌‌ నైట్స్‌‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చగా పరుచుకున్న మైదానాల్లో అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. ఢిపెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది.

ముమ్మర ప్రాక్టీస్

అయితే ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా సీఎస్‌కే ముమ్మరంగా సాధన చేస్తుంది. మంగళవారం ఆ జట్టు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ సెషన్‌కు సంబంధించిన వీడియోను సీఎస్‌కే ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, షేన్ వాట్సన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. తొలుత ఫాఫ్ డూప్లెసిస్, మురళి, విజయ్, రవీంద్ర జడేజాలు బ్యాటింగ్ చేయగా.. షార్డుల్ ఠాకుర్, పియూష్ చావ్లా, కేఎఎస్ అసిఫ్ బౌలింగ్ చేశారు. అనంతరం ధోనీ, వాట్సన్, రాయుడు తమ బ్యాటింగ్ సత్తాను నిరూపించుకున్నారు. భారీ షాట్లతో ఆకట్టుకున్నారు.

గంభీర్ ఒకసారి చూడు..

గంభీర్ ఒకసారి చూడు..

చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్న వాట్సన్, ధోనీ, రాయుడు ఏమేరకు రాణిస్తారో..? సురేశ్ రైనా గైర్హాజరీని ఎలా భర్తీ చేస్తారోనని సందేహం వ్యక్తం చేసిన గౌతమ్ గంభీర్‌కు ఈ వీడియోను చూపించాలని చెన్నై అభిమానులు కామెంట్ చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నైపై ముంబై ఇండియన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌కు ఎదుర్కోవడం ఆ జట్టుకు సవాల్‌తో కూడుకున్నదని తెలిపాడు. ఈ వ్యాఖ్యలకు హర్ట్ అయిన చెన్నై అభిమానులు.. ఈ ఇంట్రా ప్రాక్టీస్ సెషన్‌ను చూపించాలని, అప్పుడు కానీ ధోనీ, వాట్సన్, రాయుడుల ఫిట్ నెస్, బ్యాటింగ్ సామర్థ్యం ఏ మాత్రం తగ్గలేదనే విషయం గంభీర్‌కు తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.

రుతురాజ్‌కు మళ్లీ పాజిటివ్..

రుతురాజ్‌కు మళ్లీ పాజిటివ్..

ఇక చెన్నై సూపర్ ‌కింగ్స్‌ జట్టును కరోనా వైరస్ ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. చెన్నై యువ బ్యాట్స్‌మన్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఇప్పటికీ వైరస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 14 రోజుల క్వారంటైన్ ముగిసిన నేపథ్యంలో.తాజాగా నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో మళ్లీ పాజిటీవ్ వచ్చిందని, అతను ఇంకా ఐసోలేషన్‌లోనే కొనసాగుతున్నాడని తెలుస్తోంది. ఇక కరోనా నుంచి కోలుకున్న చాహర్ మాత్రం జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొంటున్నాడు.

రైనా, భజ్జీ దూరం

రైనా, భజ్జీ దూరం

ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌లు జట్టుకు దూరం కావడంతో సీఎస్‌కే అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో కూడా వీక్‌గానే కనబడుతోంది. బ్యాటింగ్‌లో రైనా స్థానాన్ని అంబటి రాయుడు, మురళీ విజయ్‌తో పూడ్చాలని చూస్తున్న సీఎస్‌కే.. బౌలింగ్‌లో పరుగులు నియంత్రణ చేసేది ఎవరూ అనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఇమ్రాన్‌ తాహీర్‌ వంటి స్పిన్నర్‌ సీఎస్‌కేకు అందుబాటులో ఉన్నా భజీ స్థానాన్ని ఏదో రకంగా భర్తీ చేయాలనే కసరత్తులు చేస్తోంది.

ఈ బయో బబుల్ ‘బిగ్‌ బాస్'లా ఉంది: శిఖర్ ధావన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 16, 2020, 14:41 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X