న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్.. నువ్వు కొవ్వుపట్టి ఉన్నావ్.. స్క్రీన్‌పై నిన్ను నీవు చూసుకున్నావా? మాథ్యూ వేడ్ స్లెడ్జింగ్! (వీడియో)

WATCH Matthew Wade and Rishabh Pants banter caught on stump mic

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో సిరీస్ అనగానే మొదట అందరికి గుర్తొచ్చేది స్లెడ్జింగ్. ఆసీస్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తాయి. అయితే గత పర్యటనలో రిషభ్ పంత్- టిమ్ పైన్ మధ్య మైదానంలో జరిగిన ఆసక్తికర సంభాషణ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ అడిలైడ్ టెస్ట్‌లో పంత్ లేకపోవడంతో ఈ సరదా స్లెడ్జింగ్‌ను అభిమానులు మిస్సయ్యారు. కానీ బాక్సింగ్ డే టెస్ట్‌లో పంత్ బరిలోకి దిగడంతో మళ్లీ ఈ కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. ఇక వికెట్ల వెనుకాల ఏదో ఒకటి అరుస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఏకగ్రాతను దెబ్బతీయడానికి ప్రయత్నించే పంత్.. మూడో రోజు ఆటలోనూ అదే చేయబోయాడు.

25 కిలోల అధిక బరువున్నావ్..

అయితే పంత్ మాటలకు చిర్రెత్తుకుపోయిన మాథ్యూ వేడ్ అతనికి ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు. రిషభ్ పంత్ అధిక బరువును ప్రస్తావిస్తూ మాథ్యూవేడ్ కామెంట్ చేశాడు. ‘పంత్ నువ్వు 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నావు. 20, 25 లేక 30 కిలోలు అయినా అధిక బరువు ఉంటావు. ఎప్పుడైన నిన్ను నీవు బిగ్ స్క్రీన్‌పై చూసుకున్నావా? నిన్ను స్క్రీన్‌‌లో చూస్తే ఫన్నీగా ఉంటుంది'అని ఘాటుగా కామెంట్ చేశాడు. ఇవి స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆసీస్ ఇన్నింగ్స్ 25 ఓవర్లో వీరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ట్వీట్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది.

నవ్వుతూ ఉండటంతోనే..

నవ్వుతూ ఉండటంతోనే..

ఇక మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్ ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ సరదా సంభాషణపై మాథ్యూ వేడ్ క్లారిటీ ఇచ్చాడు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ నవ్వుతూనే ఉన్నాడని, అసలు అతను ఎందుకు నవ్వుతున్నాడో తనకు అర్థం కాలేదన్నాడు. అతని నవ్వును చూసి నా బ్యాటింగ్ ఏమైనా ఫన్నీగా ఉందా? అనిపించిందన్నాడు. ‘పంత్ నవ్వుతూనే ఉన్నాడు. అతనేం మాట్లాడలేదు కానీ.. నన్ను చూసి నవ్వుతూ ఉననాడు. అసలు నవ్వొచ్చే విషయం ఏం ఉందో నాకు అర్థం కాలేదు. నా బ్యాటింగ్ చూసి నవ్వుతున్నాడా? అనిపించింది

మాథ్యూ వేడ్ ఒంటరి పోరాటం..

మాథ్యూ వేడ్ ఒంటరి పోరాటం..

తమ రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఓవైపు వరుసగా వికెట్లు కోల్పోతుండగా.. మరోవైపు మాథ్యూవేడ్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. పూర్తిగా డిఫెన్సివ్ మోడ్‌లో ఆడిన మాథ్యూ వేడ్ 138 బంతులో 40 పరగులు చేశాడు. కానీ రవీంద్ర జడేజా అద్భుత బంతికి వికెట్లు ముందు దొరికి పోయాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. కేవలం 2 పరుగుల ఆధిక్యంలోనే ఆసీస్ ఉండగా.. మిగిలిన నాలుగు వికెట్లు ఎంత త్వరగా తీస్తే భారత విజయం అంత సులువు అవుతోంది.

Story first published: Monday, December 28, 2020, 14:45 [IST]
Other articles published on Dec 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X