న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England vs Australia: వారెవ్వా వాటే ఫీల్డింగ్ స్టోయినిస్.. కళ్లు చెదిరే రనౌట్! (వీడియో)

Watch Marcus Stoinis stunning throw gets rid of Jason Roy in ENG vs AUS 2nd ODI

మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్ తన సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. కళ్లు చెదిరే రనౌట్‌తో ఔరా అనిపించాడు. అతని అద్భుత ఫీల్డింగ్‌కు ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్(21) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ పూర్తిగా తడబడింది.

ఓపెనర్ జాన్నీ బెయిర్ స్టో డకౌట్‌గా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ జాసన్ రాయ్ సూపర్ రనౌట్‌కు వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ వేసిన 7 ఓవర్‌ చివరి బంతిని ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ జోరూట్ సిల్లి పాయింట్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ సర్కిల్‌ లోపలే ఫీల్డింగ్ చేస్తున్న మార్కస్ స్టోయినిస్ వేగంగా పరుగెత్తి అంతే ఫాస్ట్‌గా బంతిని అందుకొని వికెట్ల వైపు విసిరాడు. బంతికాస్త నేరుగా వికెట్లను ముద్దాడటంతో జాసన్ రాయ్ భారంగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. జోరూట్ చేసిన తప్పుకు జాసన్ రాయ్ బలికావాల్సి వచ్చింది. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా పర్ఫెక్ట్ ఫీల్డింగ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ వికెట్ అనంతరం జోరూట్(39), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(42) నిలకడగా ఆడారు. క్రీజులో కుదురుకుంటున్న క్రమంలో ఆడమ్ జంపా దెబ్బతీశాడు. జోరూట్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో మూడో వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే జోస్ బట్లర్(3)ను కమిన్స్ ఔట్ చేయగా.. ఇయన్ మోర్గాన్‌ను జంపా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దీంతో 117 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.

అయితే మోర్గాన్ వికెట్‌ను తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఆసీస్ రివ్యూకు వెళ్లి సక్సెస్ అయింది. ప్రస్తుతం 34 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. క్రీజులో సామ్ బిల్లింగ్స్(5), క్రిస్ వోక్స్(9) ఉన్నారు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తప్పక గెలవాలి.

Story first published: Sunday, September 13, 2020, 20:32 [IST]
Other articles published on Sep 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X