న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా మలింగా.. ఏం యార్కర్.. ఏం బౌలింగ్..!!(వీడియో)

 Watch: Lasith Malinga smashes Andre Russell’s stumps with signature yorker

పల్లెకలే: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ తన బౌలింగ్‌లో ఏ మాత్రం పదును తగ్గలేదని మరోసారి నిరూపించాుకున్నాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన ఈ శ్రీలంక పేసర్.. 36 ఏళ్ల వయసులోనూ తన అద్భుత బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అతను వేసిన ఓ యార్కర్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. విధ్వంసకర విండీస్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ రసెల్‌ను నోరెళ్ల బెట్టేలా చేసింది.

తడబడిన రసెల్..

వెస్టిండీస్‌తో పల్లెకలే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక 25 పరుగుల తేడాతో ఓటమిపాలై రెండు టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో లసిత్ మలింగ వేసిన ఓ యార్కర్‌ను ఎదుర్కోవడంలో పవర్ హిట్టర్ ఆండ్రూ రసెల్ విఫలమయ్యాడు. అప్పటికే నాలుగు సిక్సర్లతో మంచి ఊపు మీదున్న రసెల్.. మలింగా వేసిన యార్కర్‌కు తడబడి వికెట్ సమర్పించుకున్నాడు. కుడి పాదం వద్ద పడిన బంతిని అడ్డుకునేందుకు రసెల్‌ విశ్వప్రయత్నం చేసినా లాభంలేకపోయింది. బ్యాట్‌ అంచు తాకిన బంతి వికెట్లను గీరాటేసింది. మాములుగా యార్కర్లు ఆడటం రసెల్‌కు బలహీనత అన్న విషయాన్ని గుర్తించిన మలింగా.. అద్భుత యార్కర్‌తో ఫలితాన్ని రాబట్టాడు.

సిమన్స్ హాఫ్ సెంచరీ..

సిమన్స్ హాఫ్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సిమన్స్ ( 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 67) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆండ్రూ రసెల్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35) మెరుపులు మెరిపించాడు. దీంతో.. రసెల్‌ని కట్టడి చేసేందుకు ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో బంతిని అందుకున్న మలింగ.. కళ్లుచెదిరే యార్కర్‌తో అతడ్ని పెవిలియన్‌కి పంపించాడు.

భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమి

 ఫెరీరా పోరాడినా..

ఫెరీరా పోరాడినా..

అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ కుశాల్ ఫెరీరా ( 38 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 66) అర్ధశతకంతో జట్టుకు శుభారంభం అందించినా.. మిడిలార్డర్ నుంచి అతనికి సహకారం లభించలేదు.చివర్లో హసనరంగ ( 34 బంతుల్లో 4 ఫోర్లు 44) ఒంటిరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. విండీస్ పేసర్ ఓషానే థోమస్ 5 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఇక చివరి టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి జరగనుంది.

Story first published: Thursday, March 5, 2020, 19:04 [IST]
Other articles published on Mar 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X