న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అచ్చం స్మిత్‌లాగే: జోఫ్రా ఆర్చర్ వీడియో నవ్వులు పూయిస్తోంది!

 WATCH - Jofra Archer imitates Steve Smith’s ‘art of leaving’

హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా గురువారం నుంచి లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇంగ్లాండ్ నెట్స్‌లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేశాడా? అనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. అదేంటి గాయం కారణంగా స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు దూరమయ్యాడు కదా.

టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌ను బీసీసీఐ ప్రకటించేది ఈరోజే!

అయితే, నిజానికి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన జోఫ్రా ఆర్చర్ కాదు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్. లార్డ్స్ టెస్టులో మూడో రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ తన బ్యాటింగ్‌ శైలితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆఫ్‌సైడ్‌ బంతులు సంధించే క్రమంలో వాటిని స్మిత్‌ వదిలేసి క్రమంలో నవ్వులు పూయించాడు.

ఇంగ్లండ్‌ బౌలర్లు ఆఫ్‌ స్టంప్‌ బంతులను వదిలేసే క్రమంలో స్టీవ్ స్మిత్ చిత్రవిచిత్రంగా డ్యాన్స్‌ విన్యాసాలు చేస్తూ అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఓ నెటిజన్ 'నువ్వు బంతుల్ని వదిలి వేయడంలో మాస్టర్‌వి' అంటూ ప్రశంసించాడు.

మరొక నెటిజన్ 'స్మిత్‌ ఆకట్టుకునే బ్యాట్స్‌మన్‌ కాకపోయినప్పటికీ, బంతుల్ని విడిచిపెట్టడంలో స్పెషల్‌ టాలెంట్‌ మాత్రం అతనికే సొంతం' అంటూ ఎద్దేవా చేశాడు. అయితే, మూడో టెస్టుకు ముందు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన జోఫ్రా ఆర్చర్ సైతం అచ్చం స్మిత్‌ లాగే బంతుల్ని విడిచిపెట్టాడు.

<strong>నేటి నుంచి విండీస్‌తో తొలి టెస్టు.. భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి!!</strong>నేటి నుంచి విండీస్‌తో తొలి టెస్టు.. భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి!!

ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. కాగా, లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్ విసిరిన బౌన్సర్ స్టీవ్ స్మిత్ మెడను బలంగా తాకడంతో గాయపడ్డాడు. దీంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌కు కూడా స్మిత్ దూరమయ్యాడు.

Story first published: Thursday, August 22, 2019, 13:06 [IST]
Other articles published on Aug 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X