టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌ను బీసీసీఐ ప్రకటించేది ఈరోజే!

హైదరాబాద్: టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌కు ఎంపికైన వారి పేర్లను బీసీసీఐ గురువారం అధికారికంగా ప్రకటించనుంది. టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ నియామకం కోసం ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్దులకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు గురువారంతో ముగియనున్నాయి.
ఈ నేపథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా జట్టు మేనేజర్ పోస్టుకు ఎంపికైన వారి పేర్లను బీసీసీఐ ప్రకటించనుంది. భారత జట్టు ఫిజియో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న 16 మందిని బుధవారం ఇంటర్వ్యూ చేయగా... ఫిట్‌నెస్ ట్రైనర్ పదవి కోసం 12 మందిని కమిటీ ఇంటర్యూ చేసింది.

టీమిండియాకు కొత్త ఫిజియో, ఫిట్‌నెస్ ట్రైనర్
దీంతో టీమిండియాకు రాబోయే రెండేళ్లకు గాను కొత్త ఫిజియో, ఫిట్‌నెస్ ట్రైనర్ రానున్నాడు. వరల్డ్‌కప్‌తో ముగిసిన ఆయా స్థానాల్లో ఉన్న పాట్రిక్ ఫార్హత్, శంకర్ బసు తిరిగి కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో బీసీసీఐ ఫిజియా, ఫిట్‌నెట్ ట్రైనర్‌ల కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానించింది.

సపోర్టింగ్ స్టాఫ్ రేసులో ఉన్నది వీరే
సపోర్టింగ్ స్టాఫ్‌కు గత సోమవారం ఇంటర్వ్యూలు ప్రారంభం కాగా బ్యాటింగ్ కోచ్ స్థానం కోసం ప్రస్తుత కోచ్ సంజయ్ బంగర్ సహా 14 మంది, బౌలింగ్ కోచ్ పదవి కోసం భరత్ అరుణ్ సహా 12 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇక, ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం ప్రస్తుతం ఉన్న ఆర్.శ్రీధర్‌తో పాటు సఫారీ మాజీ ఫీల్డర్ జాంటీ రోడ్స్‌తో పాటు మరో ఏడుగురు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
నేటి నుంచి విండీస్‌తో తొలి టెస్టు.. భారత జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి!!

జట్టు మేనేజర్ పదవికి 25 మంది
ఇదిలా ఉంటే, టీమిండియా జట్టు మేనేజర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 25 మందిని ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని గురువారం ఇంటర్వ్యూ చేయనుంది. ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ ముగిసిన వెంటనే సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

బ్యాటింగ్ కోచ్ అభ్యర్థులు:
మార్క్ రాంప్రాకాష్, జోనాథన్ ట్రోట్, తిలాన్ సమరవీర, ప్రవీణ్ అమ్రే, అమోల్ మజుందార్, హృషికేష్ కనిత్కర్, విక్రమ్ రాథౌర్ మరియు సంజయ్ బంగర్.
బౌలింగ్ కోచ్ అభ్యర్థులు:
వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి, అమిత్ భండారి, పరాస్ మంబ్రే, భారత్ అరుణ్.
ఫీల్డింగ్ కోచ్ అభ్యర్థులు:
జోంటి రోడ్స్, యాంట్ బోథా, ఆర్ శ్రీధర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications