న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs NZ: ఒకే రోజు 17 వికెట్లు.. మీది టాలెంట్.. మాది తొండాట! వాన్‌ను గెలికిన వసీం జాఫర్!

 Wasim Jaffer trolls Michael Vaughan after 17 wickets fall on opening day of Eng vs NZ

న్యూఢిల్లీ: అవకాశం వచ్చినప్పుడల్లా టీమిండియాపై తన అక్కసువెళ్లగక్కే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను భారత మాజీ ఓపెనర్ మైకేల్ వాన్ మరోసారి గెలికాడు. ఇప్పటికే చాలా సార్లు వాన్ వెకిలి వ్యాఖ్యలకు అదే రీతిలో సమాధానమిచ్చిన జాఫర్.. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ను ఉద్దేశించి గట్టిగా చురకలంటించాడు.

ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్టులో మొదటి రోజే 17 వికెట్లు పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ కు చేరాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. గతంలో భారత పిచ్‌లను తప్పబడుతూ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు, రచ్చను మనసులోపెట్టుకొని తనదైన రీతిలో ట్రోల్ చేశాడు.

మీది నైపుణ్యం.. మాది

లార్డ్స్‌లో ఒకే రోజు 17 వికెట్లు పడితే బౌలర్ల నైపుణ్యం.. అదే మా దగ్గర అలా పడితే పేలవ పిచ్‌లు, తొండాట అంటూ రచ్చ చేస్తారని సెటైర్లు పేల్చాడు.

'లార్డ్స్ లో ఒక్కరోజే 17 వికెట్లు నేలకూలితే అది బౌలర్ల నైపుణ్యం అవుతోంది. అదే అహ్మదాబాద్ లో ఒకే రోజు 17 వికెట్లు పడితే ఇక్కడి పరిస్థితులు, పిచ్ అని హేళన చేస్తారు.' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రెడీ సినిమాలోని 'హమ్ కరే తో సాలా క్యారెక్టర్ ఢీలా హై..' మీమ్ ను కూడా జతపరిచాడు.

 గతేడాది అహ్మదాబాద్ టెస్ట్‌లో..

గతేడాది అహ్మదాబాద్ టెస్ట్‌లో..

ఇంగ్లండ్ జట్టు.. 2021లో భారత పర్యటనకు వచ్చినప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 205 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 365 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మూడో రోజు ఉదయం భారత్ బ్యాటింగ్ చేయగా.. మిగిలిన నాలుగు వికెట్లను తొలి సెషనల్ లోనే కోల్పోయింది. ఇక అదే రోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 54 ఓవర్లకే 135 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఈ పిచ్ పై మైఖేల్ వాన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లు రెడీ చేసుకున్నారని విమర్శించాడు.

నాసిరకం పిచ్‌లంటూ..

నాసిరకం పిచ్‌లంటూ..

మట్టి పెళ్లల మధ్య మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉందంటూ ఓ వీడియోతో ట్రోల్ చేశాడు. 'నాసిరకం పిచ్‌ తయారు చేశారని.. ఇలాంటి పిచ్‌పై రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు'అంటూ వరుస ట్వీట్స్‌ చేశాడు. అయితే ఈ విమర్శలకు అప్పట్లోనే జాఫర్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫస్ట్ టెస్ట్‌లో కూడా అలాంటి పరిస్థితులే ఉండటం, వాన్ నోరు మెదపకపోవడం చూసి జాఫర్ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు.

ఈ తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 141 పరుగులకు ముగించింది. దాంతో ఆ జట్టుకు 9 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అంతకుముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు కుప్పకూలింది.

Story first published: Friday, June 3, 2022, 16:26 [IST]
Other articles published on Jun 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X