న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Wasim Jaffer vs Michael Vaughan:ఇంగ్లండ్ 120 ఆలౌట్.. మళ్లీ గిల్లుకున్న వెటరన్ క్రికెటర్స్!

Wasim Jaffer takes dig at Michael Vaughan after England loss test series against West Indies

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ మైకేల్ వాన్‌ల మధ్య మళ్లీ ట్విటర్ వార్ మొదలైంది. భారత్, ఇంగ్లండ్ జట్టు ఫలితాలపై తరుచూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ మాటల యుద్దానికి దిగే ఈ వెటరన్ క్రికెటర్స్ మరోసారి గిల్లుకున్నారు. ట్విటర్ వేదికగా హద్దులు ధాటి కొట్లాడుకుంటున్నారు.

వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్ ఘోరపరాభావాన్ని ప్రస్తావిస్తూ వసీం జాఫర్.. మైకేల్ వాన్‌పై సెటైర్లు పేల్చాడు. దానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ధీటుగా బదులిచ్చాడు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల పరాజయాన్ని ప్రస్తావించి మరింత రెచ్చగొట్టాడు. దాంతో వీరి ట్విటర్ వార్.. ఉక్రెయిన్-రష్యా మాదిరి కొనసాగుతోంది.

అసలేం జరిగిందంటే..

ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాకు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన వసీం జాఫర్ దానిని మైకేల్‌వాన్‌కు ట్యాగ్ చేస్తూ సెటైర్లు పేల్చాడు. జాఫర్ షేర్ చేసిన జాబితాలో జో రూట్ 1708 పరుగులు, రోరీ బర్న్స్ 530, ఎక్స్‌ట్రాలు 412 ఉన్నాయి. దీనికి 'ఇంగ్లండ్‌ 120 ఆలౌట్‌! ఏమైంది వాన్‌..? ఈ ఎక్స్‌ట్రా రన్స్ కొట్టిన ఆటగాడు ఐపీఎల్‌లో ఆడుతున్నాడా ఏంది..?అని ఇంగ్లండ్ జట్టును తక్కువ చేసేలా మాట్లాడుతూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే రేంజ్‌లో ట్వీట్ చేశాడు.

విషయాన్ని తెలియజేస్తూ

దీనికి మైకేల్ వాన్ కూడా తానేం తక్కువనా? అన్నట్లు అదే రీతిలో బదులిచ్చాడు. 'వసీం.. ఈ సమయంలో మేం మహిళల ప్రపంచకప్ సెమీస్ బెర్త్‌ల మీద దృష్టి సారించాం'అని భారత మహిళలు సెమీస్ చేరలేదనే విషయాన్ని తెలియజేస్తూ చురకలంటించాడు. మహిళల వన్డే ప్రపంచకప్‌‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళలు ఆఖరి బంతికి ఓటమి పాలయ్యారు. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన సౌతాఫ్రికా టీమిండియాను ఇంటికి పంపి వెస్టిండీస్‌ను సెమీస్‌కు తీసుకెళ్లింది. కీలక సమయంలో దీప్తి శర్మ చేసిన ఘోర తప్పిదం‌తో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఇక ఇంగ్లండ్ మాత్రం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది.

ఒక్క విజయం సాధించిన జట్టును..

ఒక్క విజయం సాధించిన జట్టును..

ఇక వాన్ ట్వీట్‌ చూసి చిర్రెత్తిపోయిన జాఫర్‌ వెంటనే మరో కౌంటరిచ్చాడు. జో రూట్‌ సేన గత 17 టెస్ట్‌ల్లో ఒకే ఒక విజయం సాధించిందని, ఇలాంటి చెత్త ప్రదర్శన చేసిన జట్టును ఎవరు మాత్రం పట్టించుకుంటారంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇందుకు వాన్‌ ఏ విధంగా స్పందించనున్నాడోనని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, విండీస్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను, 0-1 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. టెస్ట్‌ సిరీస్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో రూట్ సేన రెండో ఇన్నింగ్స్‌లో 120కే ఆలౌట్‌ కావడంతో విండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Story first published: Monday, March 28, 2022, 18:39 [IST]
Other articles published on Mar 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X