న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రిస్బేన్ టెస్టులో వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రం.. నటరాజన్‌ మళ్లీ బెంచ్‌కే! తుది జట్టు ఇదే!

Washington Sundar likely to Test Debut for Team India in Brisbane Test
IND VS AUS 4th Test – Natarajan or Washington? India’s Predicted XI For Series Decider In Brisbane

బ్రిస్బేన్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ రసవత్తరంగా మారింది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. సిడ్నీ టెస్టును డ్రాగా ముగించిన రహానే సేన.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే టీమిండియాను గాయాల సమస్య వేధిస్తోంది. ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా, తెలుగు క్రికెటర్ హనుమ విహారీ గాయాల కారణంగా ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరమయ్యారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయాలబారిన పడినా.. కోలుకున్నారు.

జడేజా ఔట్

జడేజా ఔట్

జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌ టెస్టు ఆరంభం కానుండటంతో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం తెలిసింది. రవీంద్ర జడేజా స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జడేజా బొటనవేలుకు బంతి బలంగా తాకడంతో గాయమైంది. మంగళవారం అతడు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. జడేజాకు 4-5 వారాలు విశ్రాంతి అవసరం.

సుందర్‌ అరంగేట్రం

సుందర్‌ అరంగేట్రం

ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన వాషింగ్టన్ సుందర్‌ను నెట్‌ బౌలర్‌గా కొనసాగిస్తున్నారు. చివరి టెస్టుకు బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో రాణించగల సుందర్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుందర్ ఐపీఎల్ 2020లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన అతడు.. పవర్ ప్లేలో అద్భుత బంతులు వేశాడు. దీంతో టీ20లకు ఎంపికయ్యాడు. ఆపై నెట్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

బుమ్రా స్థానంలో శార్దూల్

బుమ్రా స్థానంలో శార్దూల్

చివరి టెస్టుకు హనుమ విహారి దూరమవడంతో రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆడే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ అగర్వాల్ గాయం కారణంగా ఆడుతాడో లేదో తెలియదు కాబట్టి.. సాహా తుది జట్టులో ఆడనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడనున్నాడు. దీంతో పేసర్ టీ నటరాజన్‌ మళ్లీ బెంచ్‌కే పరిమితంకావాల్సి ఉంటుంది. ఒకవేళ సుందర్ ఆడకుంటే.. నటరాజన్‌ తుది జట్టులోకి రావొచ్చు. మొత్తానికి ప్లేయింగ్ లెవెన్‌పై టీమిండియా కష్టపడాల్సిందే.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ‌, శుబ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే (కెప్టెన్‌), వృద్ధిమాన్‌ సాహా, రిషబ్‌ పంత్ (కీపర్)‌, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్ ఠాకూర్‌, నవదీప్ సైనీ, మహ్మద్‌ సిరాజ్. ‌

పాపం పకోస్కీ.. నాలుగో టెస్టుకు దూరం? ఓపెనర్‌గా హారిస్!

Story first published: Wednesday, January 13, 2021, 13:50 [IST]
Other articles published on Jan 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X