WTC Final:రహానే వికెట్‌ ఎక్కువగా నిరాశపరిచింది..ఇప్పుడు భారత్‌ చేయాల్సిందిల్లా అదొక్కటే:లక్ష్మణ్‌

హైదరాబాద్: అనుభవజ్ఞుడైన అజింక్య రహానే అలా పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరడం తనను చాలా నిరాశపరిచిందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌, హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. స్క్వేర్‌ లెగ్‌లోకి ఫీల్డర్‌ వచ్చినప్పటికీ అతను సగం షాటే ఆడి మూల్యం చెల్లించుకున్నాడన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో 117 బంతులు ఎదుర్కొన్న రహానే ఐదు బౌండరీల సాయంతో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. నిజానికి విరాట్ కోహ్లీతో కలిసి శనివారం ఏకాగ్రతగా బ్యాటింగ్ చేసిన రహానే.. ఆదివారం హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకునే క్రమంలో కాస్త తొందరపడ్డాడు.

రహానే తొందరపడ్డాడు

రహానే తొందరపడ్డాడు

ఇన్నింగ్స్ 79వ ఓవర్‌లో స్వ్కేర్ లెగ్ దిశగా ఫీల్డర్‌ టామ్ లాథమ్‌ని ఉంచిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్.. షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. అక్కడికి ఫీల్డర్‌ని మార్చినప్పుడే షార్ట్ పిచ్ బంతిని వేయబోతున్నారని కామెంటేటర్లు చెప్పుకొచ్చారు. 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న రహానే.. అప్పటి వరకూ షార్ట్ పిచ్ బంతుల్ని వదిలేస్తూ వచ్చాడు. ఆ బంతిని మాత్రం రిస్క్ తీసుకుని ఫుల్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా ఫీల్డర్ లాథమ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. జింక్స్ ఔటైన తీరుపై కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ నిరాశ వ్యక్తం చేశారు. హాఫ్ సెంచరీ సాధించేందుకు రహానే తొందరపడ్డాడన్నారు.

బ్యాట్స్‌మెన్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదు

బ్యాట్స్‌మెన్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదు

తాజాగా వీవీఎస్‌ లక్ష్మణ్‌ మూడో రోజు భారత బ్యాటింగ్‌పై స్పందించాడు. 'మెరుగైన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ విభాగం జట్టును కుప్పకూల్చడంతో సౌథాంప్టన్‌లో భారత్‌ భయాలు నిజమయ్యాయి. బౌలర్లకు అనుకూలించిన పరిస్థితులను ఉపయోగించుకున్న కివీస్‌.. టీమిండియా బ్యాటింగ్‌ను ప్రశ్నించింది. దురదృష్టవశాత్తూ భారత బ్యాట్స్‌మెన్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదు. 300 చేసేలా కనిపించిన కోహ్లీసేన.. 217కే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలపైనే మూడో రోజు జట్టు ఆశలు పెట్టుకుంది. కానీ తన ఓవర్‌ నైట్‌ స్కోరుకు ఒక్క పరుగూ చేర్చనివ్వకుండానే కోహ్లీని జేమీసన్‌ బుట్టలో వేసుకున్నాడు' అని లక్ష్మణ్‌ అన్నారు.

WTC21: 'అదే మమ్మల్ని ముంచింది.. లేదంటే టేలర్‌ను ఔట్‌ చేసేవాళ్లం! సోమవారం కచ్చితంగా పైచేయి సాధిస్తాం'

ఊరించే బంతికి పంత్ బోల్తా పడ్డాడు

ఊరించే బంతికి పంత్ బోల్తా పడ్డాడు

'కివీస్ పేస్‌ దళంలో తక్కువ అనుభవం ఉన్న పొడగరి పేసర్‌ జేమీసన్‌ ఎక్కువగా ఆకట్టుకున్నాడు. అంత పొడుగున్న ఇలాంటి బౌలర్‌ లెంగ్త్, ఫుల్‌ బంతులేసి బ్యాట్స్‌మెన్‌ను ఎల్బీడబ్ల్యూ అయేలా ప్రేరేపించడం అద్భుతం. మొదట కోహ్లీకి దూరంగా బంతులేసిన అతను.. ఒకేసారి వికెట్లకు నేరుగా బౌలింగ్‌ చేసి ఔట్‌ చేశాడు. మరో ఫుల్‌ బంతితో రిషబ్ పంత్‌ను వెనక్కి పంపాడు. సుమారు అర్ధగంట పాటు ఓపిక పట్టిన పంత్‌.. జేమీసన్‌ ఊరించేలా వేసిన బంతికి తొందరపడి రెండో స్లిప్‌లో చిక్కాడు. అలాంటి పేలవ షాట్‌ ఆడినందుకు అతను చింతించాడు. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. ఈ విషయంపై జట్టు మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించాలి' అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ సూచించారు.

రహానే ఓ మార్గం కనుక్కోవాలి

రహానే ఓ మార్గం కనుక్కోవాలి

'జింక్స్ వికెట్‌ ఎక్కువగా నిరాశపరిచింది. షార్ట్‌ పిచ్‌ బంతికి అతనలా ఔటవడం ఇదే తొలిసారి కాదు. అనుభవజ్ఞుడైన రహానే.. అలాంటి బంతులను ఆడేందుకు ఓ మార్గం కనుక్కోవాలి. ఎందుకంటే ప్రతి షార్ట్‌ పిచ్‌ బంతిని పుల్‌ చేయాలనుకోవడం అత్యంత ప్రమాదకరం. స్క్వేర్‌ లెగ్‌లోకి ఫీల్డర్‌ వచ్చినప్పటికీ అతను సగం షాటే ఆడి మూల్యం చెల్లించుకున్నాడు.

భారత్‌ అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసినప్పటికీ.. కొన్నేళ్లుగా గొప్పగా రాణిస్తున్న బౌలింగ్‌ దళంపై నమ్మకం పెట్టుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, అదీ డ్యూక్‌ బంతితో వికెట్లు పడగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే భారత్‌ చేయాల్సిందిల్లా.. న్యూజిలాండ్‌లా ఓపిక పట్టడమే. ఓపికగా ఉంటూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ, క్యాచ్‌లను పట్టుకోవడమే కోహ్లీసేన చేయాలి' అని హైదరాబాద్ సొగసరి పేర్కొన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 21, 2021, 12:33 [IST]
Other articles published on Jun 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X