For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC21: 'అదే మమ్మల్ని ముంచింది.. లేదంటే టేలర్‌ను ఔట్‌ చేసేవాళ్లం! సోమవారం కచ్చితంగా పైచేయి సాధిస్తాం'

Ind vs Nz Final Shubman Gill: Bad Light Spoiled India Plan, Else Ross Taylor Would Be Out

సౌథాంప్టన్‌: మరికొన్ని ఓవర్లు వేసుంటే న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ వికెట్‌ తీసేవాళ్లమని భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. వెలుతురు లేమితో ఆటను త్వరగా ముగించాల్సి వచ్చిందని, లేదంటే ఇంకో రెండు వికెట్లు పడగొట్టేవాళ్లమన్నాడు. క్రీజులో ఇంకా నిలదొక్కుకోలేదు కాబట్టి కేన్ విలియమ్సన్‌, టేలర్‌ను సోమవారం త్వరగానే ఔట్‌ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడో రోజు కైల్‌ జేమీసన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని గిల్‌ ప్రశంసించాడు. గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో 64 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

టేలర్‌ను ఔట్‌ చేసేవాళ్లం

టేలర్‌ను ఔట్‌ చేసేవాళ్లం

ఆదివారం మూడో రోజు ఆట ముగిశాక శుభ్‌మన్‌ గిల్‌ మీడియాతో మాట్లాడాడు. 'కివీస్ ఓపెనర్ డేవాన్‌ కాన్వే వికెట్‌ మాకు అత్యంత కీలకం. మేం రాస్‌ టేలర్‌కు మరికొన్ని ఓవర్లు వేసుకుంటే.. మరో రెండు వికెట్లు దక్కేవని నా అభిప్రాయం. క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ కేన్ విలియమ్సన్‌, టేలర్‌ కొత్తవారే కాబట్టి సోమవారం మేం పైచేయి సాధిస్తాం. గతేడాది మేం న్యూజిలాండ్‌పై ఆడినప్పుడు సన్నద్ధం అయ్యేందుకు ఎక్కువ సమయం దొరకలేదు. మా దృష్టి వన్డేలు, టీ20లపైనే ఉంది' అని గిల్‌ చెప్పాడు. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను అరగంట ముందుగానే నిలిపివేశారు.

 జేమీసన్‌ అద్భుతం

జేమీసన్‌ అద్భుతం

'వాస్తవంగా చెప్పాలంటే.. చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో కివీస్‌పై మేం 250 స్కోరు చేయలేకపోయాం. ఈ టెస్టులోనూ మేం మొదట్లో దృఢంగా నిలబడ్డాం. అయినా 250 స్కోరు చేయడంలో విఫలమయ్యాం. పరిస్థితులు అలా మారాయి. బహుశా రెండో ఇన్నింగ్స్‌లోనైనా ఆ స్కోర్‌ చేసేందుకు ప్రయత్నిస్తాం. మూడో రోజు కైల్‌ జేమీసన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. బంతిబంతికీ వేరియేషన్స్ చూపించాడు. మా బౌలర్లపై పూర్తి విశ్వాసం ఉంది. సోమవారం కొత్త రోజు. తాజాగా ఆరంభిస్తాం కాబట్టి పుంజుకోగలమన్న ధీమా ఉంది' అని శుభ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు.

WTC Final 2021 డ్రా అయితే పరిస్థితి ఏంటి?.. రిజర్వ్‌ డేను ఎలా నిర్ణయిస్తారు!!

భారీ వర్షాలు

భారీ వర్షాలు

ఫైనల్‌కు వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. నాలుగోరోజు, సోమవారం సౌథాంప్టన్‌లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా ఆట కొనసాగే పరిస్థితి ఉండదని సమాచారం. 90 శాతానికి పైగా వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు అతి భారీ, ఆ తర్వాత మోస్తరు జల్లులు కురుస్తాయని అంటున్నారు. సాయంత్రానికి కాస్త తెరపినిచ్చినా వెలుతురు ఉండదని పేర్కొంటున్నారు.

న్యూజిలాండ్ పైచేయి

న్యూజిలాండ్ పైచేయి

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. మూడో రోజు బంతి, బ్యాట్‌తో టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 101 రన్స్ చేసింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్ ‌(30; 104 బంతుల్లో 3x4), డెవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో 6x4) రాణించారు.

కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు భారత్ 217 రన్స్ చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే (49; 117 బంతుల్లో 5x4), విరాట్‌ కోహ్లీ (44; 132 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లు.

Story first published: Monday, June 21, 2021, 12:05 [IST]
Other articles published on Jun 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+