న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పప్పులో కాలేసిన వీరేంద్ర సెహ్వాగ్.. నకిలీగాళ్ల వలలో చిక్కుకున్న డాషింగ్ ఓపెనర్!

Virender Sehwag Trolled after He Shares Fake News of Hima Das Winning Gold Medal at CWG 2022

హైదరాబాద్: ఈ సోషల్ మీడియాలో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఓ అబద్దాన్ని వెయ్యి ట్వీట్లతో నిజం చేయవచ్చు. నిజాన్ని వెయ్యి షేర్లతో అబద్దంగా మార్చవచ్చు. గత కొంత కాలంగా ఫేక్ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. వీటికోసం సామాజిక మాధ్యమాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ నకిలీ వార్తలకు బలయ్యాడు.

ముందు వెనుకా చూసుకోకుండా ఈ వార్తను షేర్ చేసి పప్పులో కాలేసాడు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని నాలుక కర్చుకున్న సెహ్వాగ్.. ట్వీట్‌ను తొలగించినా అప్పటికే స్క్రీన్ షాట్స్ వైరల్‌గా మారాయి. కేవలం వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే కాదు ఈ వార్త విషయంలో ప్రముఖ దినపత్రికలు, ఇంగ్లీష్ వెబ్‌సైట్స్ కూడా ఈ వార్త విషయంలో తప్పటడుగులు వేసాయి.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే..?

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్ప్రింటర్ హిమదాస్ 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు ఓ ఫేక్ వార్త హల్‌చల్ చేసింది. ఈ వార్తకు హిమదాస్‌కు చెందిన ఓ పాత వీడియోను ట్వీట్ చేయడంతో అంతా నిజమని నమ్మారు. ఆ ట్వీట్ చూసిన వెంటనే అందరికన్నా ముందే ఈ వార్తను ప్రజలకు చేరవెయ్యాలనే లక్ష్యంతో కొన్ని ఇంగ్లీష్ వెబ్‌సైట్స్ ఆతృత చూపించాయి. తెలుగు దినపత్రికకు సంబంధించిన వెబ్‌సైట్‌తో పాటు ఇంగ్లీష్ వెబ్‌సైట్ దిగార్డియన్ కూడా ఈ విషయంలో తప్పటడుగు వేసింది.

సెహ్వాగ్‌పై ట్రోలింగ్..

వీటిని చూసిన వీరేంద్ర సెహ్వాగ్... హిమా దాస్‌కు ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశాడు...'వాట్ ఏ విన్... భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన హిమాదాస్‌కు కంగ్రాట్స్'అంటూ ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్, ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని... దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. అయితే అప్పటికే చాలామంది సెహ్వాగ్ ట్వీట్‌ను స్రీన్ షాట్ తీసి ట్రోలింగ్‌కు దిగారు. కాసేపటికి వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన సంకేత్ మహదేవ్ సర్గార్‌కు సెహ్వాగ్ ‌అభినందనలు తెలియ జేశాడు.

భారత్ బోణీ..

సంకేత్ పతకంతో భారత్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో బోణీ కొట్టింది. 21 ఏళ్ల సంకేత్ మహదేవ్ తండ్రి ఓ పాన్ షాప్ యజమాని కావడం విశేషం. శనివారం జరిగిన పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగం ఫైనల్లో 248 కేజీల బరువు ఎత్తిన సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. గాయం కారణంగా కేజీ బరువు తేడాలో స్వర్ణపతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. కామన్వెల్త్‌ పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో భారత్‌కి ఇది 49వ రజతం. ఓవరాల్‌గా వెయిట్‌లిఫ్టింగ్‌లో 126 పతకాలు సాధించింది భారత్. షూటింగ్‌లో 135 పతకాలు సాధించిన భారత షూటర్లు, ఈ లిస్టులో టాప్‌లో ఉన్నారు.

Story first published: Saturday, July 30, 2022, 18:47 [IST]
Other articles published on Jul 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X