న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచి భార్య ఎప్పుడూ తన భర్త తప్పుల్ని క్షమిస్తుంది: సెహ్వాగ్‌

Virender Sehwag shared a picture with his wife and His Caption Takes jokes

హైదరాబాద్: అమెరికన్ హాస్యనటుడు మిల్టన్ బెర్లే చెప్పిన మాటలను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు. అందుకేనేమో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భర్తలు పెద్దగా నవ్వేలా సెహ్వాగ్‌ ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. అసలు విషయమేంటంటే. బుధవారం సెహ్వాగ్‌ తన భార్య ఆర్తి అహ్లవత్తో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాదు దానికి ఓ ఫన్నీ కామెంట్ పెట్టాడు.

<strong>'విండీస్‌పై ఐదుగురు బౌలర్లతో దిగితే రహానేకే అవకాశం ఇవ్వాలి'</strong>'విండీస్‌పై ఐదుగురు బౌలర్లతో దిగితే రహానేకే అవకాశం ఇవ్వాలి'

పెళ్లి తర్వాత ఫాలో అవ్వాల్సిందే:

పెళ్లి తర్వాత ఫాలో అవ్వాల్సిందే:

'మంచి భార్య ఎప్పుడూ తన భర్త తప్పుల్ని క్షమిస్తుంది. అది కూడా కేవలం తను తప్పు చేసిన సందర్భాల్లోనే' అంటూ వీరూ ఆ పోస్టుకు క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ రేపోతోంది. ఈ పోస్ట్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. ఈ సరదా క్యాప్షన్‌కు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 'ఎక్కడా రాసి లేకపోయినా, పెళ్లి తర్వాత ఫాలో అవాల్సిన చట్టం' అంటూ ఓ అభిమాని కామెంట్లు పెట్టాడు. మరో అభిమాని ఈ పోస్టుకు 'క్యాప్షన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు ఇచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, ఆర్తి అహ్లవత్ 2004లో పెళ్లి చేసుకున్నారు.

కోహ్లీకి సూచన:

కోహ్లీకి సూచన:

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సర్ వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ సూచన చేసాడు. 'టెస్టుల్లో అంజిక్య రహానే నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. విండీస్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్లతో దిగితే రహానేకే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ నలుగురు బౌలర్లైతేనే రోహిత్‌ శర్మకు జట్టులో స్థానం కల్పించాలి' అని సెహ్వాగ్‌ సూచించాడు.

ఫొటో వైరల్‌.. ఐలాండ్స్‌ బీచ్‌లో విరుష్క జంట

కోచ్ పదవికి దరఖాస్తు చేయలేదు:

కోచ్ పదవికి దరఖాస్తు చేయలేదు:

సెలక్టర్‌గా పనిచేయడంపై పనిచేయడంపై మాట్లాడుతూ... 'నేను కాలమ్స్‌ రాస్తాను. టీవీల్లో కనిపిస్తాను. సెలక్టర్‌ ఐతే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అన్ని ఆంక్షలు నేనిష్టపడతానో లేదో తెలీదు' అని వీరూ పేర్కొన్నాడు. '2017లో బీసీసీఐ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌ కోరడంతో కోచ్‌ పదవికి దరఖాస్తు చేశా. ఇప్పుడెవరూ అడగలేదు, చేయలేదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన కష్టంగా ఉంది' అని వీరు చెప్పుకొచ్చారు. ఇక స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎస్.శ్రీశాంత్‌కు విధించిన జీవిత నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించడం పట్ల సెహ్వాగ్ సంతోషం వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, August 22, 2019, 14:19 [IST]
Other articles published on Aug 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X