For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫొటో వైరల్‌.. ఐలాండ్స్‌ బీచ్‌లో విరుష్క జంట

India vs West Indies: Virat Kohli Hits Beach With Anushka Sharma Ahead of First Test

ఆంటీగ్వా: టీమిండియా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అక్కడికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లకు మధ్య కాస్త ఖాళీ సమయం దొరకడంతో విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు ఆంటీగ్వా ఐలాండ్స్‌లో సందడి చేశారు. విరుష్క జంట బీచ్‌లో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశారు.

బీచ్‌లో విరుష్క జంట:

వన్డే సిరీస్ అనంతరం జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు. వన్డే, టెస్ట్ సిరీస్ మధ్య ఖాళీ సమయంలో కోహ్లీ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేసాడు. ఖాళీ సమయం దొరకడంతో ఇద్దరూ బీచ్‌లో తిరుగుతూ సరదా సమయం గడిపారు. ఈ సమయంలో తీసిన ఫొటోను కోహ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ ఫొటోలో విరుష్క జంట బీచ్ ఒడ్డున కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

అనుష్క బికినీ ఫోటో:

విరాట్ కోహ్లీతో వివాహం అనంతరం అనుష్క శర్మ సినిమాలు తక్కువగా చేస్తూ.. భర్తతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతోంది. కోహ్లీ ఏ పర్యటనకు వెళ్లినా అనుష్క కూడా అక్కడ దర్శమిస్తోంది. ప్రస్తుతం ఈ భామ కరేబియన్ దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. వివాహం అనంతరం అందాల ప్రదర్శనకు కాస్త దూరంగా ఉన్న అనుష్క.. తాజాగా ఆంటిగ్వా బీచ్‌లో బికినీతో దిగిన ఫొటోను తన ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలలో పోస్ట్ చేసింది. 'సన్ కిస్‌డ్ అండ్ బ్లెస్‌డ్' అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2017 డిసెంబరు 11న ఇటలీలోని ఖరీదైన విల్లాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

బీచ్ పార్టీలో కోహ్లీ సేన:

బీచ్ పార్టీలో కోహ్లీ సేన:

అంతకుముందు టీమిండియా ఆటగాళ్లు బీచ్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. 'బాయ్స్‌తో బీచ్ వద్ద అద్భుతమైన రోజు' అంటూ కోహ్లీ కామెంట్ కూడా పెట్టాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహానే, బుమ్రా, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు బీచ్ పార్టీలో పాల్గొన్నారు.

తుది జట్టులో చోటు ఎవరికి:

తుది జట్టులో చోటు ఎవరికి:

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌ సమరానికి సిద్దమయింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సర్ వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. అయితే కోహ్లీ సేనకు తుది జట్టు కూర్పే పెద్ద సవాల్‌గా మారింది. మిడిలార్డర్‌లో రోహిత్ శర్మ, అజింక్య రహానేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వార్మప్‌ మ్యాచ్‌లో ఇద్దరు అదరగొట్టాడు. దీంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.

Story first published: Thursday, August 22, 2019, 11:50 [IST]
Other articles published on Aug 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+