న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ సూపరే!!

India Vs West Indies 2018, 4th ODI : Match Highlights
Virat Kohlis Direct Hit Lights Up Brabourne Stadium. Watch Video

హైదరాబాద్: కోహ్లీ ఆడుతున్నాడంటే మ్యాచ్‌లో తనకంటూ ఏదో ప్రత్యేకతను చాటుకుంటాడు. జట్టును గెలిపించేందుకు ఏది చేయడానికైనా వెనుకాడని కోహ్లీ వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన నాలుగో వన్డేలో ఫీల్డింగ్‌లో చేసిన ఫీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ శామ్యూల్స్‌ కవర్స్‌ దిశగా కొట్టిన షాట్‌ను అడ్డుకున్న కోహ్లి... అంతే వేగంగా డైవ్‌తో బంతిని నాన్‌ స్ట్రయికింగ్‌ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం క్షణాల్లో జరిగి పోయింది.

కీరన్‌ పావెల్‌ క్రీజును చేరే అవకాశం లేక

కీరన్‌ పావెల్‌ క్రీజును చేరే అవకాశం లేక

అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్‌ పావెల్‌ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ రనౌట్‌కు పావెల్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. కోహ్లి స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో మైదానంలోని భారత ఆటగాళ్లు, అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఇక నెటిజన్లు కోహ్లిని ఆకాశానికెత్తారు.

పేలవరీతిలో ధావన్ ఔట్: తొడగొట్టిన బౌలర్, ట్విట్టర్‌లో విమర్శలు

ఏం ఫీల్డింగ్‌ అన్నా.. సూపర్‌

‘అరే ఏం ఫీల్డింగ్‌ అన్నా.. సూపర్‌' అని ఒకరు.. బ్యాట్‌ ఝులిపించకుంటే.. ఫీల్డింగ్‌తో మైమరిపిస్తాడు దటీజ్‌ కోహ్లి అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ సిరీస్‌లో వరుసగా మూడు సెంచరీలతో రికార్డు సృష్టించిన కోహ్లి ఈ మ్యాచ్‌లో (16) నిరాశపరిచాడు. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌, తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడుల సెంచరీలతో భారత్‌ 224 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది.

224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా

224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రోహిత్‌ శర్మ (162; 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సు), అంబటి రాయుడు (100; 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సు) సెంచరీలతో చెలరేగిన వేళ.. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ ఏకంగా 224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. ఖలీల్‌ అహ్మద్‌ (3/13), కుల్‌దీప్‌ (3/42) ధాటికి ఛేదనలో విండీస్‌ 36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది.

పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తా

పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తా

‘బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సెంచరీ, డబుల్‌ సెంచరీల గురించి ఆలోచించను. జట్టు కోసం పరుగులు చేయాలని మాత్రమే ఆలోచిస్తాను. ఈ రోజు మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేయొచ్చని రాయుడు చెప్పాడు. కానీ నేను బ్యాటింగ్‌ మీదే దృష్టి పెట్టాను. డబుల్‌ సెంచరీ గురించి ఆలోచించలేదు'

1
44269
Story first published: Tuesday, October 30, 2018, 10:19 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X