న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: సూపర్ ఓవర్‌లో సంజూ శాంసన్‌ను పంపించాలనుకున్నాం.. కానీ

Virat Kohli reveals why he opened in the Super Over against New Zealand

వెల్లింగ్టన్: భారత్ -న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మాములుగానే జరిగినా.. గత రెండు టీ20లు మాత్రం అభిమానులకు కావాల్సిన మజానిచ్చాయి. ముఖ్యంగా రెండు మ్యాచ్ ఫలితాలు సూపర్ ఓవర్‌తోనే తేలడం ఉక్కిరిబిక్కిరి చేశాయి. రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి వరకు ఊరించిన విజయం చివరకు భారత్‌నే వరించింది.

మూడో టీ20 సూపర్ ఓవర్‌లో రాహుల్-రోహిత్ ఆడగా.. నాలుగో మ్యాచ్‌లో రాహుల్-కోహ్లీ బరిలోకి దిగి సునాయస విజయాన్నందించారు. అయితే తొలిసారి సూపర్ ఓవర్ బరిలోకి దిగిన కోహ్లీ తనకు ఇదో కొత్త అనుభవమని తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. వాస్తవానికి రాహుల్‌తో సంజూ శాంసన్‌ను సూపర్ ఓవర్‌కు పంపించాలనుకున్నామని, కానీ రాహుల్ అనుభవం కలిగిన ఆటగాడితో బరిలోకి దిగాలనుకుంటున్నానని తెలపడంతో తాను రావాల్సి వచ్చిందన్నాడు.

'గత రెండు మ్యాచ్‌ల్లో నేను కొత్త విషయాలను నేర్చుకున్నాను. ప్రత్యర్థి బాగా ఆడినా.. చివరి వరకు ప్రశాంతంగా ఉంటూ.. ఆఖరి బంతి వరకు పోరాడుతూ.. పుంజుకోవడానికి ప్రయత్నించాలని అర్థమైంది. మేం ఇలాంటి మ్యాచ్‌లు కావాలని ఎవరిని అడగలేదు. ఇంతముందుకెప్పుడు మేం సూపర్ ఓవర్ ఆడలేదు. కానీ ఆడిన రెండు గెలిచాం. ఇది మా జట్టు స్వభావాన్ని తెలియజేసింది. తొలుత మేం రాహుల్, సంజూ శాంసన్‌తో సూపర్ ఓవర్ ఆడించాలనుకున్నాం. కానీ అనుభవం ఉన్న ప్లేయర్‌తోనే ఆడుతానని రాహుల్ చెప్పడంతో నేను బరిలోకి దిగాను. అతని రెండు స్ట్రైక్స్ చాలా కీలకం. అత్యుద్భుతం. టాపార్డర్‌లో సంజూ ఫియర్ లెస్ ఆటగాడు. అయితే ఈ రోజు మేం పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. సంజూ కూడా సిక్స్ కొట్టిన తర్వాత పిచ్ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు. అతను తనని తాను సమర్థించుకోవాలి. ఇక సైనీ తన పేస్‌తో ఆకట్టుకున్నాడు. మా ఆట్ల పట్ల మేం గర్వంగా ఫీలవుతున్నాం'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ .. సోధి, బెన్నెట్ దెబ్బతీశారు. వారి ధాటికి టీమిండియా టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే (50 నాటౌట్‌; 36 బంతుల్లో 3 ఫోర్లు), శార్థుల్ ఠాకుర్‌(20)తో కలిసి 43 పరుగుల భాగస్వామ్యం అందించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. మున్రో(64), సీఫెర్ట్(57) రాణించినా.. శార్థుల్ అద్భుత బౌలింగ్‌తో సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ఆజట్టుకు ఓటమి తప్పలేదు.

Story first published: Friday, January 31, 2020, 20:18 [IST]
Other articles published on Jan 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X