ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అండగా నిలిచాడు. ఒకటి రెండు షాట్లు ఆడితే అభిషేక్ శర్మ తిరిగి రిథమ్ అందుకుంటాడని తెలిపాడు. ఫామ్ అందుకునే విషయంలో సంజూ శాంసన్‌ను చూసి అభిషేక్ శర్మ నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు.
ఈ మెగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ.. జింబాబ్వేతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. కానీ వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మళ్లీ విఫలమయ్యాడు. ఫీల్డింగ్‌లోనూ రెండు సునాయస క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మరోవైపు పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన సంజూ శాంసన్.. వెస్టిండీస్‌పై (97 నాటౌట్) అసాధారణ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అభిషేక్ శర్మను తుది జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగే సెమీఫైనల్-2లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్.. అభిషేక్ శర్మకు అండగా నిలిచాడు. 'ఈ ఆట కొన్నిసార్లు మీ పట్ల చాలా కఠినంగా, క్రూరంగా ఉంటుంది. సంజూ శాంసన్ అందుకు ఒక ఉదాహరణ. ఇది అతనికి మంచి అనుభవం, భవిష్యత్తులో అతనికి ఉపయోగపడుతుంది. ఇక అభిషేక్ శర్మ విషయానికొస్తే.. అతను ఆడే విధానం ప్రకారం ఒకటి రెండు షాట్లు ఆడితే రిథమ్‌తో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందుకుంటాడు.

వాంఖడే పిచ్ గురించి రేపు(గురువారం) మాకు పూర్తి స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం సమయంలో పిచ్‌ను అంచనా వేయడం కొంచెం కష్టం. కానీ ఇది భారీ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్ అవుతుందని మేం అనుకుంటున్నాం. ఇంగ్లండ్ చాలా తెలివైన జట్టు. వారి మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. అది వారిని ప్రమాదకరంగా మారుస్తుంది. వారి వద్ద వికెట్లు తీయగల బౌలర్లు ఉన్నారు.
టీ20 క్రికెట్‌లో వారు నిర్భయంగా ఆడుతారు. రేపు ఇరు జట్ల మధ్య మంచి పోటీ ఉంటుంది. భారత జట్టులో అపారమైన ప్రతిభ, నాణ్యత ఉంది. కానీ విజయం ఎప్పుడూ గ్యారెంటీ కాదు. కాబట్టి రేపటి సెమీఫైనల్లో ప్రతి ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
బలబలాల పరంగా భారత్, ఇంగ్లండ్ జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. కానీ వాంఖడేలో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించాలంటే అసాధారణ ప్రదర్శన కనబర్చాలి. మరోసారి భారత్ సమష్టిగా రాణిస్తే.. ఇంగ్లండ్‌కు ఓటమి తప్పదు. అయితే ఇంగ్లండ్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ జట్టులో మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు.
