For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూ శాంసన్‌కు జాక్‌ పాట్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజూ శాంసన్‌కు జాక్ పాట్ లభించింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సంజూ శాంసన్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకుకు చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తరహా సూపర్-8 మ్యాచ్‌లో సంజూ శాంసన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. ఒంటి చేత్లో టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు పేలవ ప్రదర్శనతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్.. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 65వ స్థానంలో కొనసాగాడు. కానీ వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో 25 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంక్ అందుకున్నాడు.

అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: సంజూ శాంసన్అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: సంజూ శాంసన్

డేంజర్ జోన్‌లో అభిషేక్ శర్మ..

మరోవైపు అభిషేక్ శర్మ 874 రేటింగ్ పాయింట్లతో టీ20 ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ అతని అగ్రస్థానం డేంజర్ జోన్‌లో నిలిచింది. అప్‌కమింగ్ మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ రాణించకపోతే తన నెంబర్ వన్ ర్యాంక్ కోల్పోయే ప్రమాదం ఉంది. మెగా టోర్నీలో రెండు శతకాలతో మెరిసిన పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాద ఫర్హాన్‌ రెండో ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. అతని కంటే అభిషేక్ శర్మ 26 రేటింగ్ పాయింట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ తర్వాతి మ్యాచ్‌ల్లో అతను కచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Sanju Samson jumps 25 Spots in ICC T20I Rankings After 97-not-out vs West Indies in T20 World Cup 2026

ఈ మెగా టోర్నీలో అభిషేక్ శర్మ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 80 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయ్యాడు. మరోవైపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ టాప్-10లో టీమిండియా బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదు నుంచి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆరు, ఏడు స్థానాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ ప్రపంచ కప్‌లో వీరిద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దూకుడుగా ఆడుతున్నా.. భారీ స్కోర్లుగా మలచడంలోనూ, నిలకడగా రాణించడంలోనూ విఫలమవుతున్నారు.

అగ్రస్థానంలోనే వరుణ్ చక్రవర్తీ..

ఐసీసీ టీ20 ఆల్-రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంకు అందుకున్నాడు. పాకిస్థాన్ ఓపెనర్ సైమ్ అయూబ్‌ మూడో స్థానానికి పడిపోయాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఈ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ ఆల్-రౌండర్ జేసన్ హోల్డర్ 11వ స్థానానికి, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. జింబాబ్వేపై 24 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయడం అతనికి కలిసొచ్చింది. దక్షిణాఫ్రికాపై రెండు వికెట్లతో రాణించిన జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకొని ఏడో స్థానంలో నిలిచాడు. మూడు సూపర్-8 మ్యాచ్‌ల్లో ఒక్కో వికెట్ పడగొట్టిన వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు.

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. కోహ్లీ, రోహిత్ రికార్డ్ బద్దలు!చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. కోహ్లీ, రోహిత్ రికార్డ్ బద్దలు!

Story first published: Wednesday, March 4, 2026, 18:13 [IST]
Other articles published on Mar 4, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+