న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డో: లారా ప్రశంసల వర్షం

 Virat Kohli is crickets Cristiano Ronaldo, says Brian Lara

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని క్రికెట్లో క్రిస్టియానొ రొనాల్డొతో పోల్చాడు. గొప్ప నైపుణ్యంతో తన బ్యాటింగ్‌ను విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని స్థాయికి తీసుకెళ్లాడని లారా ఈ సందర్భంగా వెల్లడించాడు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో లారా మాట్లాడుతూ "ప్రిపరేషన్‌తో సహా మరెన్నో లక్షణాలు విరాట్‌ కోహ్లీకి ప్రత్యేకంగా నిలిచేలా చేస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌ లేదా రోహిత్‌ కన్నా అతడు ప్రతిభావంతుడని నేను అనుకోను. కానీ, ఆట పట్ల అంకితభావం, కఠినంగా శ్రమించడం, మ్యాచ్‌కు సన్నద్ధం కావడం అతడిని మరోస్థాయికి తీసుకెళ్లాయి. నా వరకైతే అతడు క్రికెట్లో క్రిస్టియానొ రొనాల్డొ" అని కొనియాడాడు.

198 balls, 0 wickets: చెపాక్‌లో స్పిన్నర్ల ఖాతాలో ఓ చెత్త రికార్డు198 balls, 0 wickets: చెపాక్‌లో స్పిన్నర్ల ఖాతాలో ఓ చెత్త రికార్డు

ఏ తరానికి చెందిన గొప్ప జట్లలోనైనా

ఏ తరానికి చెందిన గొప్ప జట్లలోనైనా

1970ల నాటి క్లైవ్‌ లాయిడ్‌, 1948ల నాటి బ్రాడ్‌మన్‌ జట్టు.. ఇలా ఏ తరానికి చెందిన గొప్ప జట్లలోనైనా కోహ్లీకి స్థానం ఉంటుందని లారా చెప్పాడు. "కోహ్లీ శారీరక దృఢత్వం, మానసిక బలం నమ్మశక్యం కావు. అతడి బ్యాటింగ్‌ నైపుణ్యం అసమానం. ఏ తరానికి చెందిన జట్టులోనైనా అతడికి చోటు ఉంటుంది. అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటు నమోదు చేయడం మాములు విషయం కాదు" అని లారా పేర్కొన్నాడు.

డబ్బు కోసమే ప్రైవేటు లీగుల్లో

డబ్బు కోసమే ప్రైవేటు లీగుల్లో

వెస్టిండీస్‌ క్రికెటర్లు డబ్బు కోసమే ప్రైవేటు లీగుల్లో ఆడతారన్న దృక్పథాన్ని లారా ఈ సందర్భంగా ఏకీభవించలేదు. గతంలో కూడా వెస్టిండిస్ ఆటగాళ్లు ప్రైవేట్ లీగుల్లో ఆడుతూ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారని లారా తెలిపాడు. ప్రైవేట్ లీగుల్లో ఆడినా టెస్టు క్రికెట్‌ను ఆడాలని లారా సూచించాడు.

T20 World Cup: దక్షిణాఫ్రికా తరుపున ఏబీ డివిలియర్స్, కొత్త కోచ్ బౌచర్ ఇలా!

ఉదాహరణగా భారత ఆటగాళ్లు

ఉదాహరణగా భారత ఆటగాళ్లు

ఇందుకు ఉదాహరణగా భారత ఆటగాళ్లను చూపించాడు. భారత్‌లో ఐపీఎల్‌ ఆడుతున్నప్పటికీ టెస్టు క్రికెట్‌ ఆడటానికి వారెంతో ప్రాధాన్యమిస్తారని లారా ఈ సందర్భంగా వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న యువకులను రాబోయే రోజుల్లో గుర్తించి సరైన ప్రణాళికను క్రికెట్ వెస్టిండీస్ బోర్డు రూపొందించాలని లారా చెప్పాడు.

తక్కువ టెస్ట్ స్థాయిలో

తక్కువ టెస్ట్ స్థాయిలో

"వెస్టిండిస్ తక్కువ టెస్ట్ స్థాయిలో పాల్గొనవలసిన అవసరం లేదని నేను ఆశిస్తున్నాను. వెస్టిండfస్ vs ఆస్ట్రేలియా (వొరెల్ ట్రోఫీ), వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ (విస్డెన్ ట్రోఫీ) వంటి సిరీస్‌లు గత సంవత్సరాలుగా సృష్టించిన వారసత్వాన్ని కలిగి ఉన్నాయి" అని లారా చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, December 16, 2019, 17:34 [IST]
Other articles published on Dec 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X