T20 World Cup: దక్షిణాఫ్రికా తరుపున ఏబీ డివిలియర్స్, కొత్త కోచ్ బౌచర్ ఇలా!

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆ దేశ జాతీయ జట్టు తరుపున మళ్లీ బ్యాట్ పట్టనున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఏబీ డివిలియర్స్‌తో చర్చలు జరుపుతానని దక్షిణాఫ్రికా కొత్త కోచ్ మార్క్ బౌచర్ అన్నాడు.
మార్క్ బౌచర్ శనివారం దక్షిణాఫ్రికా కోచ్‌గా నియమితుడయ్యాడు. 2023 వరకూ బౌచర్ కోచ్‌గా కొనసాగనున్నాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ఉంచడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పిన మార్క్ బౌచర్... ఇందులో భాగంగా రిటైర్మెంట్ తీసుకున్న ఏబీతో మాట్లాడతానని చెప్పాడు.

ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు
"ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు జట్టుకు ప్రాతినిధ్యం వహించాలి. ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడన్నది నా ఉద్దేశం. నేనెందుకు అతడితో మాట్లాడకూడదు? ఇప్పుడే బాధ్యతలు అందుకున్నా. ఏబీతో పాటు మరికొంతమంది రిటైర్డ్ ఆటగాళ్లతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను" అని మార్క్ బౌచర్ వెల్లడించాడు.

దక్షిణాఫ్రికా క్రికెట్ మేలు కోసమే
దక్షిణాఫ్రికా క్రికెట్ మేలు కోసమే తాను ఇదంతా చేస్తున్నట్లు మార్క్ బౌచర్ వెల్లడించాడు. గతేడాది ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యాంగా వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దక్షిణాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.

2004లో దక్షిణాఫ్రికా జట్టు తరుపున అరంగేట్రం
2004లో దక్షిణాఫ్రికా జట్టు తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్ టెస్టుల్లో 8,765, వన్డేల్లో 9,577, టీ20ల్లో 1,672 పరుగులు చేశాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికా బోర్డు అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్ ఒకడు. రిటైర్మెంట్ తర్వాత డివిలియర్స్ పలు లీగ్‌ల్లో ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications