న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఎంఎస్ ధోనీ చెత్త రికార్డు స‌మం చేసిన విరాట్ కోహ్లీ!!

Virat Kohli equals MS Dhonis record for most Test ducks by an Indian captain
IND VS ENG 4th Test: Kohli Has More Ducks Than Bumrah & Equals Dhoni Unwanted Record|Oneindia Telugu

అహ్మ‌దాబాద్‌: నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు భోజన విరామ సమయానికి భారత్ 80/4తో నిలిచింది. ధాటిగా ఆడుతున్న వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (27) సరిగ్గా విరామ సమయానికి ఒక బంతి ముందు ఔటయ్యాడు. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 37.5 బంతికి స్లిప్‌లో బెన్ స్టోక్స్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. అంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చి రాగానే డకౌట్ అయ్యాడు.

ధోనీ చెత్త రికార్డు స‌మం చేసిన కోహ్లీ

ధోనీ చెత్త రికార్డు స‌మం చేసిన కోహ్లీ

బెన్ స్టోక్స్‌ వేసిన 26వ ఓవర్‌ నాలుగో బంతిని విరాట్ కోహ్లీ ఫ్లిక్‌ చేయగా.. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కి తాకి కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ చేతిలో పడింది. అనూహ్యంగా దూసుకొచ్చిన షార్ట్‌పిచ్ బంతి ఆడ‌లేక కోహ్లీ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఈ డ‌కౌట్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెత్త రికార్డును విరాట్ స‌మం చేయ‌డం విశేషం. కోహ్లీకి కెప్టెన్‌గా టెస్టుల్లో ఇది 8వ డ‌కౌట్‌. గ‌తంలో ధోనీ కూడా కెప్టెన్‌గా 8సార్లు డ‌కౌట‌య్యాడు. ఇప్పుడు విరాట్ అత‌ని రికార్డును స‌మం చేశాడు. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ డ‌కౌట్ కావ‌డం ఇది రెండోసారి.

బుమ్రా కంటే కూడా ఎక్కువ‌సార్లు

బుమ్రా కంటే కూడా ఎక్కువ‌సార్లు

విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పేస్‌ బౌల‌ర్ జస్ప్రీత్ బుమ్రా కంటే కూడా కోహ్లీ ఎక్కువ‌సార్లు డ‌కౌట్ కావ‌డం విశేషం. బుమ్రా టెస్టుల్లో 9సార్లు డ‌కౌట్ కాగా.. విరాట్ 12సార్లు డ‌కౌట‌య్యాడు. ఇక టెస్టుల్లో పేసర్ ఇషాంత్ శ‌ర్మ 32 డ‌కౌట్ల‌తో టాప్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యుత్త‌మ బ్యాట్స్‌మ‌న్‌గా మ‌న్న‌న‌లు అందుకుంటున్న కోహ్లీ.. ఏడాది కాలంగా త‌న స్థాయిలో ఫామ్‌లో లేడు. 2020లో ఒక్క సెంచ‌రీ కూడా చేయ‌లేదు. ఈ ఏడాది ఇంగ్లండ్ సిరీస్‌లో అయినా క‌చ్చితంగా చేస్తాడ‌ని అభిమానులు ఆశించినా.. అదీ జ‌ర‌గ‌డం లేదు.

కెప్టెన్‌గా 60వ మ్యాచ్‌

కెప్టెన్‌గా 60వ మ్యాచ్‌

మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు విరాట్ కోహ్లీ కెరీర్‌లో కెప్టెన్‌గా 60వ మ్యాచ్‌గా నిలిచింది. దీంతో అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన టీమిండియా కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ (60 మ్యాచ్‌లు) రికార్డును కోహ్లీ సమం చేశాడు. మహీ టీమిండియాకు కెప్టెన్‌గా 60 టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. 2014లో ధోనీ టెస్టులకు గుడ్ బై చెప్పడంతో కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అప్పటినుంచి 2021 వరకు కోహ్లీ భారత్ తరఫున 60 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మైదానంలో బద్దలు కొట్టకపోయినా

మైదానంలో బద్దలు కొట్టకపోయినా

విరాట్ కోహ్లీ ఈ మధ్య మైదానంలో రికార్డులు బద్దలు కొట్టకపోయినా.. సోష‌ల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో స‌రికొత్త రికార్డు నెలకొల్పాడు. సోమవారం నాటికి ఇన్‌స్టాలో కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. సాకర్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్‌), లియోనెల్‌ మెస్సీ (184 మిలియన్‌), నేమార్‌ (147 మిలియన్‌) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లీనే కావడం విశేషం. ఇంతమంది ఫాలోవర్లు ఉన్న తొలి క్రికెటర్‌ కోహ్లీనే. 100 మిలియన్‌ ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి ఆసియా వ్యక్తిగా మరో రికార్డు సృష్టించాడు.

India vs England: లంచ్‌ బ్రేక్.. రహానే ఔట్‌! భారత్ స్కోర్ 80/4!

Story first published: Friday, March 5, 2021, 13:18 [IST]
Other articles published on Mar 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X